MI vs KKR | ముంబై ఇండియన్స్‌కు వరుస షాకులు.. రెండు వికెట్లు డౌన్
MI vs KKR | ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా వరుస షాకులు ఇచ్చింది. ఏడో ఓవర్లో ఇషాన్ కిషన్ (40) వికెట్ తీయగా..8వ ఓవర్లో రోహిత్ శర్మ (19)ను ఔట్ చేసింది.
MI vs KKR | ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా వరుస షాకులు ఇచ్చింది. ఏడో ఓవర్లో ఇషాన్ కిషన్ (40) వికెట్ తీయగా..8వ ఓవర్లో రోహిత్ శర్మ (19)ను ఔట్ చేసింది. అంతకుముందు లక్ష్య చేధనలో భాగంగా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఓపెనర్లు రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్ చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి ఆరు ఓవర్లలోనే 62 పరుగులు చేశారు. 8 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్ 71/2. అంటే అంటే ముంబై గెలవడానికి 48 బంతుల్లో బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది.కాగా, వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో కోల్‌కతా ఆదిలోనే కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ పేసర్ల విజృంభణతో 10 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే డేంజరస్ ఫిలిప్ సాల్ట్(6)ను తుషార వెనక్కి పంపాడు. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్(0)ను బమ్రా బౌల్డ్ చేశాడు. దాంతో, నరైన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్(42) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(7)తో కీలక పరుగులు చేశాడు.
ముంబై అంటేనే విరుచుకుపడే వెంకటేశ్ సారథితో కలిసి మూడో వికెట్‌కు 30 రన్స్ జోడించారు. అయితే.. ఐదో ఓవర్ తొలి బంతికే అయ్యర్‌ను బౌల్డ్ చేసి కోల్‌కతాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రానా(33), ఆండ్రూ రస్సెల్(24) వేగంగా ఆడి ఐదో వికెట్‌కు 39 రన్స్ రాబట్టారు. ఆఖర్లో రింకూ సింగ్(20) తన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. బుమ్రా 16వ ఓవర్లో రింకూను ఔట్ చేసినా.. రమన్‌దీప్ సింగ్(17 నాటౌట్) ఆరో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దాంతో, కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(239), పీయూష్ చావ్లా(228)లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

