IPL 2024 | ఈ ఏడాది జనవరిలో గబ్బా (బ్రిస్బేన్) వేదికగా ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మధ్య ముగిసిన రెండో టెస్టులో విండీస్ యువ సంచలనం షెమర్ జోసెఫ్ ఏడు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. కాలికి గాయమైనా జోసెఫ్.. పటిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను వారి సొంతగడ్డమీదే వణికించాడు. జోసెఫ్ జోరుతో సుమారు మూడు దశాబ్దాల తర్వాత వెస్టిండీస్.. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ టెస్టు ముగిశాక స్వదేశంలో కొంతకాలం పాటు విరామం తీసుకున్న గబ్బా హీరో.. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్లో అతడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తరఫున ఆడనున్నాడు.
జోసెఫ్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన లక్నో.. ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అయితే అతడికి స్వాగతం చెప్పబోయే క్రమంలో ఆస్ట్రేలియాను ట్రోల్ చేసింది. ఈ మేరకు వీడియోలో షెమర్ క్యారమ్ బోర్డు ఆడుకుంటుండగా ఒక వ్యక్తి అతడి దగ్గరకు వచ్చి… ‘షెమర్ బ్రదర్.. ఈ వైఫై పాస్వర్డ్ ఏంటో చెప్తావా..?’ అని అడిగాడు. దానికి షెమర్ స్పందిస్తూ… ‘టూటా హై గబ్బాకా ఘమంద్’ (గబ్బా అహంకారం కూలిపోయింది) అని చెబుతాడు. ఆ తర్వాత ఆసీస్ వికెట్లను అతడు ఎలా నేలకూల్చాడన్న వీడియోను దానికి జతచేసి షేర్ చేసింది. గబ్బాలో భారత జట్టు గతంలో ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు హిందీ కామెంట్రీలో ఇది (టూటా హై గబ్బాకా ఘమంద్) ఫేమస్ అయింది.
One day in India, and Shamar… 😂 pic.twitter.com/UwalRssOsn
— Lucknow Super Giants (@LucknowIPL) March 15, 2024
లక్నో సూపర్ జెయింట్స్ ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ స్థానంలో జోసెఫ్‌ను ఎంచుకుంది. రూ. 3 కోట్ల భారీ ఆఫర్‌తో అతడిని లక్నో తీసుకుంది. ఐదో రోజు ఆటలో భారత్.. 328 పరుగుల ఛేదనను విజయవంతంగా పూర్తిచేసింది.
Ab Shamar ki baari hai 🤌🔥 pic.twitter.com/rq9pBXjpGV
— Lucknow Super Giants (@LucknowIPL) March 15, 2024