IPL 2024 | రచిన్ దంచెన్.. డెవాన్ రాణించెన్.. తమిళ తంబీలు హ్యాపీ
IPL 2024 | కివీస్‌తో తొలి మ్యాచ్‌లో కాన్వే, రచిన్లు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. మిచెట్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్, పాట్ కమిన్స్ పేస్ త్రయంతో పాటు స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఈ ద్వయం భారీగా పరుగులు రాబట్టింది.
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2024 సీజన్ ఆరంభానికి సమాయత్తమవుతున్న వేళ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ సీజన్లో సీఎస్కే తరఫున ఆడనున్న న్యూజిలాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నేటి నుంచి మొదలైన టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో దంచికొట్టాడు. 35 బంతుల్లోనే 2 బౌండరీలు, 6 భారీ సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. అతడికి తోడు సీఎస్కే ఓపెనర్ అయిన డెవాన్ కాన్వే.. 46 బంతుల్లో 5 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 63 రన్స్ చేశాడు. ఈ ఇద్దరి బాదుడుత తొలి మ్యాచ్‌లో కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరుచేసింది.
గతేడాది భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 578 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. మూడు సెంచరీలు బాదాడు. వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన అరంగేట్ర ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఐపీఎల్లో అతడిని తమ సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూశాయి. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ. 1.8 కోట్లతో దక్కించుకుంది.
కివీస్‌తో తొలి మ్యాచ్‌లో కాన్వే, రచిన్లు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. మిచెట్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్, పాట్ కమిన్స్ పేస్ త్రయంతో పాటు స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఈ ద్వయం భారీగా పరుగులు రాబట్టింది. కాన్వే కాస్త నెమ్మదిగానే ఆడగా రచిన్ కూడా అతడు ఎదుర్కున్న తొలి 16 బంతుల్లో 14 రన్స్ మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత 19 బంతుల్లో ఏకంగా 54 పరుగులు సాధించాడు. ఐపీఎల్ ఆరంభానికి ముందు ఈ ఇద్దరూ చెన్నై ఆటగాళ్లు దంచికొట్టడంతో తమిళ తంబీలు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

