IPL 2023 : చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. నికోలస్ పూరన్(62), స్టోయినిస్(65) సునామీలా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, 213 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో చేదించింది. సొంత గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.
Hello from Bengaluru 👋@RCBTweets take on @LucknowIPL in Match 1⃣5⃣ of #TATAIPL 2023 🙌
Who are you supporting tonight folks? #RCBvLSG pic.twitter.com/EjleFv9IBF
— IndianPremierLeague (@IPL) April 10, 2023
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. నికోలస్ పూరన్(62), స్టోయినిస్(65) సునామీలా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, 213 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో చేదించింది. సొంత గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపొందింది. 20వ ఓవర్లో విజయానికి 5 పరుగులు కావాలి. హర్షల్ పటేల్ వుడ్‌ను బౌల్డ్ చేశాడు. మూడో బంతికి బిష్ణోయ్ రెండు రన్స్ తీశాడు. భారీ షాట్ కొట్టిన ఉనాద్కాట్(9) క్యాచ్ ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ సింగిల్ తీయడంతో లక్నో అనూహ్యంగా గెలిచింది.
𝗣𝗿𝗼𝗹𝗶𝗳𝗶𝗰 𝗣𝗢𝗢𝗥𝗔𝗡!
This has been a sensational knock in the chase from the @LucknowIPL batter 🫡
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/L5MnJsH56K
— IndianPremierLeague (@IPL) April 10, 2023
19 ఓవర్లకు లక్నో 208 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 5 పరుగులు కావాలి. ఉనాద్కాట్, వుడ్ క్రీజులో ఉన్నారు.
నికోలస్ పూరన్(62) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో పూరన్ కొట్టిన బంతిని షహ్బాజ్ అహ్మద్ క్యాచ్ పట్టాడు.
నికోలస్ పూరన్(62) ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. సిక్స్‌లతో హోరెత్తిస్తున్నాడు. దాంతో, లక్నో 16 ఓవర్లకు 185 రన్స్ చేసింది. ఆయూష్ బదొనీ (19) క్రీజులో ఉన్నాడు.
నికోలస్ పూరన్(51) హాఫ్ సెంచరీ కొట్టాడు. వెనే పార్నెల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతను ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో వేగవంతమైన ఫీఫ్టీ బాదాడు.
నికోలస్ పూరన్(40) సిక్సర్లతో చెలరేగుతున్నాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ బాదాడు. ఆయూష్ బదొనీ (11) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లకు లక్నో స్కోర్.. 154/3. లక్నో విజయానికి 36 బంతుల్లో 59 రన్స్ కావాలి.
12 ఓవర్లకు లక్నో116 రన్స్ చేసింది. నికోలస్ పూరన్(10), ఆయూష్ బదొనీ (5) క్రీజులో ఉన్నారు. లక్నో విజయానికి 48 బంతుల్లో 97 రన్స్ కావాలి.
లక్నో మరింత కష్టాల్లో పడింది. సిరాజ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్(18) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడిన అతనుబౌండరీ వద్ద కోహ్లీ క్యాచ్ పట్టడతో వెనుదిరిగాడు.
కరన్ శర్మ బిగ్ వికెట్ తీశాడు. హాఫ్ సెంచరీతో జోరుమీదున్న స్టోయినిస్(65)ను ఔట్ చేశాడు. దాంతో, 99 వద్ద లక్నో నాలుగో వికెట్ పడింది. 76 రన్స్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
స్టోయినిస్(46) దంచి కొడుతున్నాడు. కరణ్ శర్మ బౌలింగ్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో 16 రన్స్ వచ్చాయంతే. కేఎల్ రాహుల్(14) క్రీజులో ఉన్నాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు రన్స్ జోడించారు. 9 ఓవర్లకు లక్నో స్కోర్.. 76/3
హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి స్టోయినిస్(31) సిక్స్ బాదాడు. రెండో, మూడో బంతికి ఫోర్లు కొట్టాడు. దాంతో 17 రన్స్ వచ్చాయంతే. కేఎల్ రాహుల్(14) క్రీజులో ఉన్నాడు. ఐదు ఓవర్లకు లక్నో స్కోర్.. 60/3
పవర్ ప్లేలో లక్నో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. వెనే పార్నెల్ బౌలింగ్‌లో స్టోయినిస్(11) బౌండరీ కొట్టాడు. దాంతో 7 రన్స్ వచ్చాయంతే. రాహుల్(11) క్రీజులో ఉన్నాడు.
లక్నోమూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా డకౌటయ్యాడు. వెనే పార్నెల్ బౌలింగ్‌లో దినేశ్ కార్తిక్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. అంతకుముందు బంతికి దీపక్ హుడా(9) ఔట్ కావడంతో పార్నెల్ హ్యాట్రిక్‌పై నిలిచాడు. రాహుల్(8), స్టోయినిస్ క్రీజులో ఉన్నారు. నాలుగు ఓవర్లకు లక్నో స్కోర్..24/3
#LSG are in trouble
Wayne Parnell has got 2️⃣ in his first over 👌
Deepak Hooda and Krunal Pandya depart
Follow the match ➡️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG | pic.twitter.com/94qWpPVcjh
— IndianPremierLeague (@IPL) April 10, 2023
లక్నో బిగ్ వికెట్ కోల్పోయింది. వెనే పార్నెల్ బౌలింగ్‌లో దీపక్ హుడా(9) క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండో బంతికి మిడాఫ్‌లో బౌండరీ కొట్టిన అతను నాలుగో బంతికి కీపర్ దినేశ్ కార్తిక్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్(8) క్రీజులో ఉన్నాడు.
డేవిడ్ విల్లే బౌలింగ్‌లో 5 రన్స్ వచ్చాయి. కేఎల్ రాహుల్(3), దీపక్ హుడా(2) క్రీజులో ఉన్నారు. రెండో ఓవర్లకు లక్నో స్కోర్..10/1
లక్నోకు షాక్.. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన కైల్ మేయర్స్(0) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో మూడో బంతికి మేయర్స్ బౌల్డ్ అయ్యాడు.
Off stump out of the ground! 🔥🔥
Early success for @mdsirajofficial & @RCBTweets 🙌
Kyle Mayers departs early in the chase.
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/wbd3h1Xhpr
— IndianPremierLeague (@IPL) April 10, 2023
సొంత స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, లక్నోసూపర్ జెయింట్స్ ముందు కొండంత టార్గెట్ పెట్టింది. ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్(78), విరాట్ కోహ్లీ(61), గ్లెన్ మ్యాక్స్‌వెల్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో, రెండు వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది. మార్క్ వుడ్ వేసిన 20వ ఓవర్లో నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు వందకు పైగా రన్స్ జోడించారు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలా ఒక వికెట్ తీశారు.
In the slot and BOOM 🎇
When @faf1307 hits it, it stays hit 😉
200 up for @RCBTweets! #TATAIPL | #RCBvLSG
Describe those two sixes with an emoji 🔽 pic.twitter.com/fg9twXiDXl
— IndianPremierLeague (@IPL) April 10, 2023
ఆర్సీబీ స్కోర్ రెండొందలు దాటింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్(53), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(78) దంచి కొడుతున్నారు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 107 రన్స్ జోడించారు. 19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 203/1
గ్లెన్ మ్యాక్స్‌వెల్(52) ఫిఫ్టీ బాదాడు. ధనాధన్ బ్యాటింగ్ చేసిన అతను సిక్సర్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు.
It's raining SIXES when the BIG SHOW is at the crease! 🤩
He brings up a terrific half-century 😎
100 partnership also up for the second wicket 🙌
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG | @Gmaxi_32 pic.twitter.com/2VG7LMrRG1
— IndianPremierLeague (@IPL) April 10, 2023
కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(71) దంచి కొడుతున్నాడు. జయదేవ్ ఉనాద్కాట్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఆఖరి బంతికి బౌండరీ బాదాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(40) క్రీజులో ఉన్నాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 87 రన్స్ జోడించారు. 18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 183/1
అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్(35) సిక్స్, ఫోర్ కొట్టాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ 150 దాటింది.కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(54) హాఫ్ క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 64 రన్స్ జోడించారు. 17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 160/1
మార్క్ వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(53) హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(22) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు యాభై రన్స్ జోడించారు. నాలుగో బంతికి బౌండరీ కొట్టాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 146/1
Absolute Carnage 🔥🔥@faf1307 deposits one out of the PARK 💥💥
We are in for an entertaining finish here folks!
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/ugHZEMWHeh
— IndianPremierLeague (@IPL) April 10, 2023
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(52) హాఫ్ సెంచరీ కొట్టాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
ఆర్సీబీ తొలి వికెట్ పడింది. విరాట్ కోహ్లీ(61) ఔటయ్యాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన బంతిని బౌండరీ వద్ద స్టోయినిస్ అందుకున్నాడు. దాంతో, 96 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఫాఫ్ డూప్లెసిస్(31), మ్యాక్స్‌వెల్ క్రీజులో ఉన్నారు.
ఆర్సీబీ ఓపెనర్లు దంచి కొడుతున్నాడరు. హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ(58) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టాడు. ఫాఫ్ డూప్లెసిస్(25) నాలుగో బంతికి బౌండరీ కొట్టాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 87/0
సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఫాఫ్ డూప్లెసిస్(20) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 74/0
A splendid start from @RCBTweets as they move to 56/0 at the end of powerplay 💥
The FIFTY partnership is up between openers @imVkohli & @faf1307!
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uonBeeuy4v
— IndianPremierLeague (@IPL) April 10, 2023
కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో6 రన్స్ వచ్చాయి. విరాట్ కోహ్లీ(48), ఫాఫ్ డూప్లెసిస్(16) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 68/0
మార్క్ వుడ్ వేసిన ఆరో ఓవర్లో విరాట్ కోహ్లీ(42) చెలరేగాడు. రెండో బంతిని స్ట్రెయిట్‌గా బౌండరీకి పంపాడు. ఆ తర్వాత బంతికి మిడాఫ్‌లో సిక్స్ బాదాడు. దాంతో ఆర్సీబీ స్కోర్ 50 దాటింది. ఫాఫ్ డూప్లెసిస్(12) క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 56/0
A splendid start from @RCBTweets as they move to 56/0 at the end of powerplay 💥
The FIFTY partnership is up between openers @imVkohli & @faf1307!
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uonBeeuy4v
— IndianPremierLeague (@IPL) April 10, 2023
విరాట్ కోహ్లీ(30) ధాటిగా ఆడుతున్నాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో తొలి బంతిని స్ట్రెయిట్‌గా స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 9 రన్స్ వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(10) క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 42/0
విరాట్ కోహ్లీ(23) ధాటిగా ఆడుతున్నాడు. అవేశ్ ఖాన్‌ను టార్గెట్ చేసిన అతను తొలి బంతిని, మూడో బంతిని బౌండరీ దాటించాడు. దాంతో, 8 రన్స్ వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(8) క్రీజులో ఉన్నాడు. 4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 33/0
కృనాల్ పాండ్యా వేసిన మూడో ఓవర్లో ఆఖరి బంతికి ఫాఫ్ డూప్లెసిస్(8) ఫోర్ కొట్టాడు. విరాట్ కోహ్లీ(15) క్రీజులో ఉన్నాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 25/0
అవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో మూడో బంతికి విరాట్ కోహ్లీ(13) సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని బౌండరీ దాటించాడు. 13 రన్స్ వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(2) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 17/0
జయదేవ్ ఉనాద్కాట్ వేసిన తొలి ఓవర్లో 4 రన్స్ వచ్చాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ(3), ఫాఫ్ డూప్లెసిస్(1) క్రీజులో ఉన్నారు.
బెంగళూరలోని చిన్న స్వామి స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆర్సీబీకి మద్దతుగా నిలిచేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులు స్టేడియం నిండిపోయింది. సొంత గ్రౌండ్లో డూప్లెసిస్ సేనకు ఇది రెండో మ్యాచ్. దాంతో, ఈసారి కూడా తమ జట్టు విక్టరీ కొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
The two captains are all smiles ahead of the clash 😃
Are you ready Bengaluru? 😎
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/5BwqCizLCM
— IndianPremierLeague (@IPL) April 10, 2023
స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ అద్భుతంగా రాణిస్తుండడంతో లక్నో అతడినే కొనసాగించాలని భావించడమే అందుకు కారణం. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమైన మార్క్ వుడ్ తుది జట్టుకు ఎంపికయ్యాడు.
లక్నో, ఆర్సీబీ జట్లు సబ్స్టిట్యూట్స్ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. ఇరుజట్లు వీళ్లలో ఒకరిని బ్యాటింగ్, బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోనున్నాయి.
లక్నో సబ్స్టిట్యూట్స్ : బదోని, సింగ్, కృష్ణప్ప గౌతమ్, మన్కడ్, సామ్స్
ఆర్సీబీ సబ్స్టిట్యూట్స్ : కరన్ శర్మ, ప్రభుదేశాయి. అకాశ్ దీప్, మైఖేల్ బ్రేస్‌వెల్, సోను
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మొదట బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.