IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు. ఆఖరి ఓవరి వరకు ఫలితం తేలని మ్యాచ్‌లో ఢిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ విజేతగా నిలిచింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్(67) అర్ధ శతకంతో కదం తొక్కడంతో పంజాబ్ కింగ్స్‌పై 7 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. మొదట పంజాబ్‌ను 153కే కట్టడి చేసిన గుజరాత్.. లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. డేవిడ్ మిల్లర్(17) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, సొంత గ్రౌండ్లో నెగ్గాలనుకున్న పంజాబ్‌కు నిరాశే మిగిలింది.
.@ShubmanGill brings up his 5️⃣0️⃣* 👏 👏@gujarat_titans need 34 runs in 24 balls.
Follow the match ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/cZZnq6h1Vt
— IndianPremierLeague (@IPL) April 13, 2023
ఐపీఎల్ 16వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు. ఆఖరి ఓవరి వరకు ఫలితం తేలని మ్యాచ్‌లో ఢిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ విజేతగా నిలిచింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్(67) అర్ధ శతకంతో కదం తొక్కడంతో పంజాబ్ కింగ్స్‌పై 7 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. మొదట పంజాబ్‌ను 153కే కట్టడి చేసిన గుజరాత్.. లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. డేవిడ్ మిల్లర్(17) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, సొంత గ్రౌండ్లో నెగ్గాలనుకున్న పంజాబ్‌కు నిరాశే మిగిలింది.
.@ShubmanGill brings up his 5️⃣0️⃣* 👏 👏@gujarat_titans need 34 runs in 24 balls.
Follow the match ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/cZZnq6h1Vt
— IndianPremierLeague (@IPL) April 13, 2023
సామ్ కరన్ బిగ్ వికెట్ తీశాడు. శుభ్‌మన్ గిల్(67)ను బౌల్డ్ చేశాడు. దాంతో, గుజరాత్ నాలుగో వికెట్ కోలపోయింది.
రబాడ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(65) మిడాన్‌లో సిక్స్, డేవిడ్ మిల్లర్(12) బౌండరీ కొట్టారు. 18 ఓవర్లకు స్కోర్.. 141/3. గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 13 రన్స్ కావాలి.
హాఫ్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్(58) వేగంగా ఆడుతున్నాడు. సామ్ కరన్ వేసిన 17వ ఓవర్లో బౌండరీ కొట్టాడు. మొదటి బంతికి ఔటయ్యాడు. , డేవిడ్ మిల్లర్(7) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 129/3. గుజరాత్ విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్(51) హాఫ్ సెంచరీ బాదాడు. రాహుల్ చాహర్ వేసిన 16వ ఓవర్లో బౌండరీతో అతను ఫిఫ్టీకి చేరువయ్యాడు. 40 బంతుల్లో 6 ఫోర్లతో యాభై రన్స్ కొట్టాడు.
హర్‌ప్రీత్ బ్రార్ బిగ్ వికెట్ తీశాడు. అతను వేసిన 15వ ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్యా(8) ఔటయ్యాడు. సామ్ కరన్ క్యాచ్ పట్టడంతో పాండ్యా పెవిలియన్ చేరాడు. శుభ్‌మన్ గిల్(43) క్రీజులో ఉన్నాడు. గుజరాత్ విజయానికి 36 బంతుల్లో 48 పరుగులు కావాలి. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 105/3.
గుజరాత్ 13 ఓవర్లకు 91 స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(40), హార్దిక్ పాండ్యా(1) క్రీజులో ఉన్నాడు. గుజరాత్ విజయానికి 42 బంతుల్లో59 పరుగులు కావాలి.
గుజరాత్ రెండో వికెట్ పడింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 12 ఓవర్లో సాయి సుదర్శన్(19) ఔటయ్యాడు. అతను కొట్టిన బంతిని బౌండరీ వద్ద ప్రభ్సిమ్రాన్ క్యాచ్ పట్టాడు. దాంతో, 89 రన్స్ వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్(39) క్రీజులో ఉన్నాడు.
.@arshdeepsinghh strikes as Prabhsimran Singh takes the catch 👌 👌#GT 2 down as Sai Sudharsan departs.
Follow the match ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/SA2nsySUm4
— IndianPremierLeague (@IPL) April 13, 2023
రాహుల్ చాహర్ వేసిన వేసిన 9వ ఓవర్లో శుభ్‌మన్ గిల్(35) రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో, 11 రన్స్ వచ్చాయి. సాయి సుదర్శన్(12) క్రీజులో ఉన్నాడు. గుజరాత్ విజయానికి 66 బంతుల్లో76 పరుగులు కావాలి.
పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టానికి 56 రన్స్ చేసింది. శుభ్‌మన్ గిల్(20), సాయి సుదర్శన్(5) క్రీజులో ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. వృద్ధిమాన్ సాహా(30)ను ఔట్ చేసి అతను ఈ ఫీట్ సాధించాడు. వేగంగా ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 64 మ్యాచుల్లోనే అతను వంద వికెట్లు కూల్చడం విశేషం. గత సీజన్లో ఈ దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు.
Milestone 🔓
A special 💯 for @KagisoRabada25 👏👏
The @PunjabKingsIPL pacer gets his 1️⃣0️⃣0️⃣th wicket in #TATAIPL!#PBKSvGT pic.twitter.com/0JkdsxK40Q
— IndianPremierLeague (@IPL) April 13, 2023
కగిసో రబాడ తొలి వికెట్ అందించాడు. జోరుమీదున్న వృద్ధిమాన్ సాహా(30)ను ఔట్ చేశాడు. సాహా కొట్టిన బంతిని బౌండరీ వద్ద మాథ్యూ షార్ట్ అందుకున్నాడు. దాంతో, 48 రన్స్ వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది. శుభ్‌మన్ గిల్(17 క్రీజులో ఉన్నాడు.
వృద్ధిమాన్ సాహా(24) ధనాధన్ ఆడుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు. దాంతో, 18 రన్స్ వచ్చాయి. శుభ్‌మన్ గిల్(11) క్రీజులో ఉన్నాడు. . మూడు ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 36/0.
కగిసో రబాడవేసిన రెండో ఓవర్లో వృద్ధిమాన్ సాహా(6), శుభ్‌మన్ గిల్(11) చెరొక బౌండరీ బాదారు. రెండు ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 18.
అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో బంతికి ఓపెనర్ శుభ్‌మన్ గిల్(5) బౌండరీ బాదాడు. వృద్ధిమాన్ సాహా(2) క్రీజులో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను తీసుకుంది. భానుక రాజపక్సే ప్లేస్‌లో అతను మైదానంలోకి వచ్చాడు.
పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 153 రన్స్ చేసింది. గుజరాత్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. జోష్ లిటిల్ వేసిన 20వ ఓవర్లో హర్‌ప్రీత్ బ్రార్() చెలరేగాడు. లాంగాన్‌లో 89 మీటర్ల సిక్స్ కొట్టాడు. షారుక్ ఖాన్(22) రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మాథ్యూ షార్ట్(36), జితేశ్ శర్మ(25), సామ్ కరన్(22) మినహా ఎవరూ రాణించలేదు. చివర్లో షారుక్ ఖాన్(22) చెలరేగడంతో పంజాబ్ ఆ మాత్రం సోర్ చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు, అల్జారీ జోసెఫ్ షమీ, రషీద్ ఖాన్, జోష్ లిటిల్ తలా ఒక వికెట్ తీశారు.
🎥 Packing a punch, the @CurranSM way! 👊
Here's how he tonked a SIX off Rashid Khan 🔽 #TATAIPL | #PBKSvGT | @PunjabKingsIPL pic.twitter.com/1zQmDSrkZV
— IndianPremierLeague (@IPL) April 13, 2023
మోహిత్ శర్మ రెండో వికెట్ తీశాడు. ధాటిగా ఆడుతున్న సామ్ కరన్(22)ను ఔట్ చేశాడు. బౌండరీ వద్ద శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు.
షమీ వేసిన 18 వ ఓవర్లో సామ్ కరన్(22) థర్డ్‌మ్యాన్ దిశగా ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి షారుక్ ఖాన్(15) సిక్స్ కొట్టాడు. 18 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 136/5
అల్జారీ జోసెఫ్ వేసిన 17 వ ఓవర్లో భానుక రాజపక్సే(20) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడిన అతను గిల్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 115 వద్ద పంజాబ్ ఐదో వికెట్ పడింది.
రషీద్ ఖాన్ వేసిన 16 వ ఓవర్లో సామ్ కరన్(13) డీప్ మిడ్ వికెట్లో సిక్స్ బాదాడు. భానుక రాజపక్సే(19) క్రీజులో ఉన్నాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 109/4
పంజాబ్ స్కోర్ వేగం తగ్గింది. మోహిత్ శర్మ బౌలింగ్‌లో 8 రన్స్ వచ్చాయంతే. భానుక రాజపక్సే(18), సామ్ కరన్(4) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 99/4
పంజాబ్ స్కోర్ వేగం తగ్గింది. మోహిత్ శర్మ బౌలింగ్‌లో భానుక రాజపక్సే(14) ఫైన్ లెగ్‌లో ఫోర్ కొట్టాడు. జితేశ్ శర్మ(16) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 81/3
అల్జారీ జోసెఫ్ వరుసగా రెండో ఓవర్లోనూ నాలుగే రన్స్ ఇచ్చాడు. దాంతో, పది ఓవర్లకు పంజాబ్ 3 వికెట్ల నష్టానికి స్కోర్ చేసింది. జితేశ్ శర్మ(15), భానుక రాజపక్సే(9) క్రీజులో ఉన్నారు.
జితేశ్ శర్మ(14) జోరు పెంచాడు. రషీద్ ఖాన్ వేసిన 9వ ఓవర్లోమొదటి, ఐదో బంతికి బౌండరీ బాదాడు. దాంతో, 8 రన్స్ వచ్చాయి. భానుక రాజపక్సే(7), క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 71/3
అల్జారీ జోసెఫ్ వేసిన ఎనిమిదో ఓవర్లో 4 రన్స్ వచ్చాయి. భానుక రాజపక్సే(7, జితేశ్ శర్మ(6) క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 63/3
పంజాబ్ బిగ్ వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్(36) బౌల్డయ్యాడు. భానుక రాజపక్సే(5) క్రీజులో ఉన్నాడు.
T. I. M. B. E. R!@rashidkhan_19 strikes in his first over 👌 👌#PBKS lose Matthew Short.
Follow the match ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT | @gujarat_titans pic.twitter.com/sNKeJ4T96z
— IndianPremierLeague (@IPL) April 13, 2023
పవర్ ప్లేలో పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 52 రన్స్ చేసింది. మాథ్యూ షార్ట్(35) బాదుతున్నాడు. జోష్ లిటిల్ వేసిన ఆరో ఓవర్లో నాలుగో బంతికి బౌండరీ కొట్టాడు. దాంతో, పంజాబ్ స్కోర్ యాభై దాటింది. భానుక రాజపక్సే(2) క్రీజులో ఉన్నాడు.
మాథ్యూ షార్ట్(28) దంచి కొడుతున్నాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి బౌండరీ, ఆఖరి బంతికి 88 మీటర్ల సిక్స్ బాదాడు. దాంతో, 12 రన్స్ వచ్చాయి. , భానుక రాజపక్సే(1) క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 42/2
పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ పడింది. ఓపెనర్ శిఖర్ ధావన్(8) జోష్ లిటిల్ ఓవర్లో క్యాచ్ ఔటయ్యాడు. ఎల్బీ అప్పీల్ నుంచి తప్పించుకున్న అతను రెండో బంతిని గాల్లోకి లేపాడు. అల్జారీ జోసెఫ్ పరుగెత్తుతూ వెళ్లి క్యాచ్ పట్టాడు. దాంతో, 28 రన్స్ వద్ద పంజాబ్ రెండో వికెట్ పడింది.
మాథ్యూ షార్ట్(18) ధాటిగా ఆడుతున్నాడు. షమీ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దాంతో, 11 రన్స్ వచ్చాయి. శిఖర్ ధావన్(8) క్రీజులో ఉన్నాడు. 3 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 27/1
జోష్ లిటిల్ వేసిన రెండో ఓవర్లో శిఖర్ ధావన్(8) రెండు బౌండరీలు బాదాడు. మాథ్యూ షార్ట్(8) క్రీజులో ఉన్నాడు.
షమీ వేసిన మొదటి ఓవర్లో మాథ్యూ షార్ట్(8) రెండు ఫోర్లు కొట్టాడు. నాలుగో బంతిని పాయింట్లో, ఐదో బంతిని ఆఫ్‌సైడ్ బౌండరీ దాటించాడు. దాంతో, 8 రన్స్ వచ్చాయి.
పంజాబ్ కింగ్స్‌కు షాక్.. షమీ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(0) ఔటయ్యాడు. కవర్స్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్ క్రీజులో ఉన్నారు.
Breakthrough in the very first over for @gujarat_titans and @MdShami11 finds early success in Mohali 😎#PBKS lose Prabhsimran Singh's wicket
Follow the match ▶️ https://t.co/qDQuP8ecgd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/razP6N4FLn
— IndianPremierLeague (@IPL) April 13, 2023
గుజరాత్ సబ్స్టిట్యూట్స్ : విజయ్ శంకర్, జయంత్ యాదవ్, శ్రీకర్ భరత్, అభిమన్యు మనోహర్, శివం మావి.
పంజాబ్ సబ్స్టిట్యూట్స్ : హర్‌ప్రీత్ భాటియా, రాహుల్ చాహర్, సికిందర్ రజా, అథర్వ తైడే, గుర్నూర్ బ్రార్.
🚨 Team Updates 🚨
A look at the two sides for the #PBKSvGT contest👌👌
Follow the match ▶️ https://t.co/qDQuP8ecgd #TATAIPL pic.twitter.com/44i7o1bOaa
— IndianPremierLeague (@IPL) April 13, 2023
పంజాబ్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా స్థానంలో భానుక రాజపక్సే, నాథన్ ఎల్లిస్ ప్లేస్‌లో కగిసో రబడ ఆడుతున్నారు.
గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. ఛేజింగ్ ఈజీ ఉంటుందని అతను ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to bowl first against @PunjabKingsIPL.
Follow the match ▶️ https://t.co/qDQuP8ecgd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jM5STYICl6
— IndianPremierLeague (@IPL) April 13, 2023
గుజరాత్ టైటన్స్ తరఫున పేసర్ మోహిత్ శర్మ తొలి మ్యాచ్ ఆడనున్నాడు. షమీ నుంచి అతను డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై ఆఖరి ఓవర్లో ధారళంగా పరుగులిచ్చిన యశ్ దయాల్ స్థానంలో మోహిత్ ఆడనున్నాడు. గతంలో అతను చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.