IPL 2023 : వాంఖడే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్(83 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భీకరమైన ఫామ్‌లో ఉన్న అతను తనదైన షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. నేహల్ వధేరా(52 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు దాంతో, ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అలవోకగా గెలిచింది. 6 వికెట్ల తేడాతో రోహిత్ సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మరో రెండు ఓవర్లు ఉండగానే ఓడించింది. దాంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్లో నేహల్ వధేరా(52 నాటౌట్) సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. దాంతో, 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కామెరూన్ గ్రీన్(2 నాటౌట్) వచ్చాడు.
ముంబై నాలుగో వికెట్ పడింది. టిమ్ డేవిడ్(0) వచ్చీ రావడంతోనే ఔటయ్యాడు. భారీ షాట్ ఆడిన అతను లాంగాఫ్‌లో మ్యాక్స్‌వెల్ చేతికి చిక్కాడు. కామెరూన్ గ్రీన్ వచ్చాడు. నేహల్ వధేరా(46) క్రీజులో ఉన్నాడు.
సూర్యకుమార్ యాదవ్(67)ఔటయ్యాడు. విజయ్‌కుమార్ ఓవర్లో కేదార్ జాదవ్ చేతికి చిక్కాడు. దాంతో 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ధనాధన్ ఆడిన సూర్య ముంబైని విజయం ముంగిట నిలబెట్టాడు. గెలవడానికి 8 పరగులు కావాలి. నేహల్ వధేరా(45) క్రీజులో ఉన్నాడు.
సూర్యకుమార్ యాదవ్(67) విధ్వంసం సృష్టిస్తున్నాడు. హసరంగ ఓవర్లో అతను రెండు సిక్స్‌లు బాదాడు. నేహల్ వధేరా(45) . బౌండరీ బాదాడు. 15 ఓవర్లకు స్కోర్.. 174/2 ముంబై విజయానికి 30 బంతుల్లో 26 పరుగులు కావాలి.
సూర్యకుమార్ యాదవ్(51) ఫిప్టీ కొట్టాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను రెండు పరుగులు తీసి యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. నేహల్ వధేరా(40) ఆడుతున్నాడు.
హర్షల్ పటేల్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(39), నేహల్ వధేరా(40) చెరొక బౌండరీ బాదారు. 17 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు స్కోర్.. 141/2 ముంబై విజయానికి 42 బంతుల్లో 59 పరుగులు కావాలి.
హసరంగ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(25), నేహల్ వధేరా(33) చెరొక సిక్స్ బాదారు. 10 ఓవర్లకు స్కోర్.. 114/2. ముంబై విజయానికి 54 బంతుల్లో 86 పరుగులు కావాలి.
Just over halfway through the chase! @mipaltan move past 100 as @surya_14kumar & Nehal Wadhera complete a FIFTY-run stand! 👍 👍
Follow the match ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/txg2uYQ4if
— IndianPremierLeague (@IPL) May 9, 2023
హర్షల్ పటేల్ ఓవర్లో నేహల్ వధేరా(25) బౌండరీ బాదాడు. సూర్యకుమార్ యాదవ్(18) ఆడుతున్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 99/2
హర్షల్ పటేల్ ఓవర్లో నేహల్ వధేరా(13), సూర్యకుమార్ యాదవ్(8) చెరొక ఫోర్ కొట్టారు. 6 ఓవర్లకు స్కోర్.. 74/2
విజయ్‌కుమార్ ఓవర్లో నేహల్ వధేరా(8) సిక్స్ బాదాడు. సూర్యకుమార్ యాదవ్(2) ఆడుతున్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 62/2
హసరంగ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. నాలుగో బంతికి ఇషాన్ కిషన్(42)ను ఔట్ చేసిన అతను ఆఖరి బంతికి రోహిత్ శర్మ(7) ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, 52 పరగులకేముంబై ఓపెనర్లు పెవిలియన్ చేరారు. నేహల్ వధేరా వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్(1) ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 52/2
Ishan Kishan ✅
Rohit Sharma ✅@Wanindu49 gets both the #MI openers in no time! ⚡️⚡️A fine fifty-run opening partnership comes to an end👏🏻👏🏻
Follow the match ▶️ https://t.co/5DLbp9hcev #TATAIPL | #MIvRCB pic.twitter.com/UQzEqDcwzz
— IndianPremierLeague (@IPL) May 9, 2023
దంచికొడుతున్న ఇషాన్ కిషన్(42) ఔటయ్యాడు. హసరంగ ఓవర్లో కీపర్ అనుజ్ రావత్ చేతికి చిక్కాడు. తొలి, మూడో బంతుల్ని ఫోర్, సిక్స్‌గా మలిచిన అతను నాలుగో బంతికి వెనుదిరిగాడు. దాంతో, 51 రన్స్ వద్ద ముంబై తొలి వికెట్ పడింది. సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. రోహిత్ శర్మ(7) ఆడుతున్నాడు.
ఇషాన్ కిషన్(26) జోరు పెంచాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, ముంబై స్కోర్ 30 దాటింది. రోహిత్ శర్మ(7) ఆడుతున్నాడు. మూడు ఓవర్లకు స్కోర్.. 34/0
హేజిల్‌వుడ్ ఓవర్లో రోహిత్ శర్మ(6) తొలి బంతికే బౌండరీ బాదాడు. ఇషాన్ కిషన్(13) రెండు బౌండరీలు కొట్టాడు. రెండు ఓవర్లకు స్కోర్.. 19/0
సిరాజ్ వేసిన తొలి ఓవర్లో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(4) తొలి బంతికే బౌండరీ కొట్టాడు. రోహిత్ శర్మ(0) ఆడుతున్నాడు.
ఆకాశ్ మంద్వాల్ వేసిన 20వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఇంపాక్ట్ ప్లేయర్ కేదార్ జాదవ్(12) హసరంగ(12) నాటౌట్‌గా నిలిచారు. దాంతో, ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు కొట్టింది.
దంచుతున్న దినేశ్ కార్తిక్(30) ఔటయ్యాడు. జోర్డాన్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద వదేరా క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. హసరంగ వచ్చాడు.
దినేశ్ కార్తిక్(30) వేగం పెంచాడు. కార్తికేయ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. నాలుగో బంతికి సిక్స్ బాదాడు. ఆఖరి బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ కేదార్ జాదవ్(10) క్రీజులో ఉన్నాడు. 18 ఓవర్లకు స్కోర్.. 185/5
జోర్డాన్ ఓవర్లో దినేశ్ కార్తిక్(15) బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత బంతికి గ్రీన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. ఆఖరి బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ కేదార్ జాదవ్(10) రెండు పరుగులు తీశాడు. 17ఓవర్లకు స్కోర్.. 170/5
కార్తికేయ ఓవర్లో దినేశ్ కార్తిక్(8) బౌండరీ కొట్టాడు. ఆకరి బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ కేదార్ జాదవ్(8) రెండు పరుగులు తీశాడు. 16 ఓవర్లకు స్కోర్.. 161/5
కామెరూన్ గ్రీన్ బిగ్ వికెట్ తీశాడు. జోరుమీదున్న డూప్లెసిస్(65)ను ఔట్ చేశాడు. స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన డూప్లెసిస్ విష్ణు వినోద్ చేతికి చిక్కాడు. దాంతో, 145 పరుగులకు ఆర్సీబీ సగం వికెట్లు కోల్పోయింది. కేదార్ జాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. దినేశ్ కార్తిక్(1) క్రీజులో ఉన్నాడు.
A bit of a juggle but a catch nonetheless! @mipaltan are chipping away here at Wankhede! 👏 👏
Cameron Green strikes. 👌 👌#RCB lose their captain Faf du Plessis for a fine 65.
Follow the match ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/jVaCh8rPa6
— IndianPremierLeague (@IPL) May 9, 2023
ఆర్సీబీ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్(68), మహిపాల్ లోమ్రోర్(1) ఔటయ్యారు. ప్రస్తుతం డూప్లెసిస్(65), దినేశ్ కార్తిక్(1) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లకు స్కోర్.. 145/4.
ఆకాశ్ మంద్వాల్ ఓవర్లో ఫ్రీ హిట్‌ను ఫైన్ లెగ్‌లో డూప్లెసిస్(44) స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ వంద దాటింది. హాఫ్ సెంచరీ కొట్టిన గ్లెన్ మ్యాక్స్‌వెల్(51) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 104/2.
ఫామ్‌లో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్(50) హాఫ్ సెంచరీ బాదాడు. ఆకాశ్ మంద్వాల్ ఓవర్లో సింగిల్ తీసి 50 ఫూర్తి చేసుకున్నాడు. అతను 24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్ధ శతకానికి చేరువయ్యాడు.
ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జోర్డాన్‌కు మ్యాక్స్‌వెల్(36) సిక్స్‌తో స్వాగతం పలికాడు. రెండో బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపాడు. 16 పరుగులు వచ్చాయి. దాంతో, ఆర్సీబీ స్కోర్ 70 దాటింది. డూప్లెసిస్(29)క్రీజులో ఉన్నాడు.7 ఓవర్లకు స్కోర్.. 72/2.
పీయూష్ చావ్లా ఓవర్లో మ్యాక్స్‌వెల్(23)తొలి బంతికి స్వీప్ షాట్‌తో బౌండరీ కొట్టాడు. రెండో బంతికి ఫోర్ బాదాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ 50 దాటింది. 11 పరుగులు వచ్చాయి. డూప్లెసిస్(26)క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 56/2.
End of Powerplay!
No shortage of action in the first 6 overs! ⚡️ ⚡️
2⃣ wickets for @mipaltan
5⃣6⃣ runs for @RCBTweets
Follow the match ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/0VtH2D2lAn
— IndianPremierLeague (@IPL) May 9, 2023
డేంజరస్ మ్యాక్స్‌వెల్(13) దూకుడుగా ఆడుతున్నాడు. బెహ్రెన్‌డార్ఫ్ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఆఖరి బంతికి డూప్లెసిస్(25) సిక్స్ బాదాడు. 16 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు స్కోర్.. 45/2.
మ్యాక్స్‌వెల్(4), డూప్లెసిస్(18) దంచుతున్నారు. కామెరూన్ గ్రీన్ ఓవర్లో చెరొక ఫోర్ కొట్టారు. 9 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు స్కోర్.. 29/2.
బెహ్రెన్‌డార్ఫ్ రెండో వికెట్ తీశాడు. అనుజ్ రావత్(6)ను ఔట్ చేశాడు.తొలి బంతికి ఫోర్ బాదిన అనుజ్ రెండో బంతికి థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడాడు. పరుగెత్తుతూ వెళ్లిన కామెరూన్ గ్రీన్ అద్భుత క్యాచ్ పట్టాడు. దాంతో, 16 పరుగులకే ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ వచ్చాడు.
డూప్లెసిస్(9) జోరు పెంచాడు. పీయూష్ చావ్లా ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. 9 పరుగులు వచ్చాయి.అనుజ్ రావత్(2) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు స్కోర్..12/1.
తొలి ఓవర్లోనే ఆర్సీబీకి షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ(1) ఔటయ్యాడు. బెహ్రెన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనుజ్ రావత్ వచ్చాడు. మూడో బంతికి డూప్లెసిస్(1) ఇచ్చిన క్యాచ్‌ను నేహల్ వధేరా వదిలేశాడు. ఆ తర్వాత బంతికే కోహ్లీ వికెట్ కోసం ముంబై రివ్యూ తీసుకుంది. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలడంతో అంపైర్ ఔటిచ్చాడు.
Cracking start with the ball for @mipaltan! 👌 👌
A huge wicket in the first over as Jason Behrendorff strikes 👏 👏#RCB lose Virat Kohli.
Follow the match ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/mwwrVv9rvm
— IndianPremierLeague (@IPL) May 9, 2023
ముంబై సబ్స్టిట్యూట్స్ : రమన్‌దీప్ సింగ్, స్టబ్స్, విష్ణు వినోద్, సందీప్ వారియర్, రాఘవ్ గోయల్.
ఆర్సీబీ సబ్స్టిట్యూట్స్ : కేదార్ జాదవ్, బ్రాస్‌వెల్, ప్రభుదేశాయ్, కరణ్ శర్మ, షహబాజ్ అహ్మద్.
Here are the @mipaltan and @RCBTweets' line-ups ❗️
Follow the match ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/7xetjODvc9
— IndianPremierLeague (@IPL) May 9, 2023
ముంబై జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాశ్ మంద్వాల్, కార్తికేయ, బెహ్రెన్‌డార్ఫ్
ఆర్సీబీ జట్టు : డూప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హసరంగ, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్, సిరాజ్, హేజిల్‌వుడ్.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది.