IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వరుసగా రెండో విజయం సాధించింది. సొంత గ్రౌండ్లో గెలిచి బోణీ కొట్టాలనుకున్న ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చింది. రోహిత్ శర్మ సేనపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. అజింక్యా రహానే(61) అర్ధ శతకంతో చెలరేగాడు. అతను ఔటయ్యాక అంబటి రాయుడు(20), రుతురాజ్ గైక్వాడ్(40) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి.
అర్షద్ ఖాన్ వేసిన 19వ ఓవర్లోఅంబటి రాయుడు(16) బౌండరీ కొట్టాడు. దాంతో, సీఎస్కే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్(40) నాటౌట్‌గా నిలిచాడు.దాంతో, ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. సొంత గ్రౌండ్లో గెలిచి బోణీ కొట్టాలనుకున్న ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చింది. రోహిత్ శర్మ సేనపై వికెట్ల తేడాతో గెలిచింది. అజింక్యా రహానే(61) అర్ధ శతకంతో చెలరేగడంతో చెన్నైఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి.
జాసన్ బెహ్రెండార్ఫ్ వేసిన 18వ ఓవర్లో అంబటి రాయుడు(16) రెండు బౌండరీలు కొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్(40) క్రీజులో ఉన్నారు. 18 ఓవర్లకు 153 రన్స్ చేసింది. సీఎస్కే విజయానికి 12 బంతుల్లో5 పరుగులు కావాలి.
చెన్నై 16 ఓవర్లకు 135 రన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్(37), అంబటి రాయుడు(2) క్రీజులో ఉన్నారు. సీఎస్కే విజయానికి 24బంతుల్లో 23 పరుగులు కావాలి.
చెన్నై మూడో వికెట్ పడింది. జోరు మీదున్న శివం దూబే(28) కుమార్ కార్తికేయ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. దాంతో, 43 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. రుతురాజ్ గైక్వాడ్(29), అంబటి రాయుడు క్రీజులో ఉన్నారు.
శివం దూబే(28) ధాటిగా ఆడుతున్నాడు. హృతిక్ ష్లోకీన్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో సిక్స్ కొట్టాడు. నాలుగో బంతికి రుతురాజ్ గైక్వాడ్(29) బౌండరీ బాదాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. 13 ఓవర్లకు చెన్నై స్కోర్.. 125/2. సీఎస్కే విజయానికి 36 బంతుల్లో 33 పరుగులు కావాలి.
10 ఓవర్లకు ముంబై 97 రన్స్ చేసింది. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్(20), శివం దూబే(9) చెరొక బౌండరీ కొట్టారు. దాంతో, 11 రన్స్ వచ్చాయి.
అజింక్యా రహానే(61) ఔటయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన అతను ఆ తర్వాతి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. మిడాన్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 82 రన్స్ వద్ద చెన్నై రెండో వికెట్ పడింది. రుతురాజ్ గైక్వాడ్(14) క్రీజులో ఉన్నాడు.
అజింక్యా రహానే(58) హాఫ్ సెంచరీ బాదడంతో చెన్నై పవర్ ప్లేలో భారీ స్కోర్ చేసింది. ఒక వికెట్ నష్టానికి 68 రన్స్ కొట్టింది. రుతురాజ్ గైక్వాడ్(8) క్రీజులో ఉన్నాడు.
అజింక్యా రహానే(52) హాఫ్ సెంచరీ బాదాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఫోర్‌తో ఫిఫ్టీకి చేరువయ్యాడు. క్లాస్ బ్యాటింగ్‌తో చెలరేగిన అతను19 బంతుల్లోనే అతను 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో యాభై రన్స్ చేశాడు. ఈ సీజన్లో వేగవంతమైన ఫిఫ్టీ బాదాడు. అంతేకాదు సీఎస్కే తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. 2014లో సురేశ్ రైనా 16 బంతుల్లోనే కోల్‌కతాపై హాఫ్ సెంచరీ కొట్టాడు.
FIFTY 🆙 for @ajinkyarahane88 💛
He's looking in ultimate touch here in Mumbai 👌👌@ChennaiIPL finish the powerplay with 68/1 after 6 overs!
Follow the match ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/fgI9yaLrWz
— IndianPremierLeague (@IPL) April 8, 2023
అజింక్యా రహానే(44) చెలరేగి ఆడుతున్నాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో రెండో బంతిని ఆఫ్ సైడ్ సిక్సర్‌గా మలిచాడు. దాంతో, చెన్నై స్కోర్ 50 దాటింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(4) క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లకు చెన్నై స్కోర్.. 55/1.
అర్షద్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో అజింక్యా రహానే(36) రెచ్చిపోయాడు. మొదటి బంతిని స్టాండ్సలోకి పంపాడు. తర్వాతి వరుసగా నాలుగు బౌండరీలు కొట్టాడు. దాంతో, 23 రన్స్ వచ్చాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(2) క్రీజులో ఉన్నాడు. 4 ఓవర్లకు చెన్నై స్కోర్.. 44/1.
6⃣4⃣4⃣4⃣4⃣
23 runs off the fourth over 🔥🔥@ajinkyarahane88 on song 🎶🎶
Follow the match ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/deSvY5UkUq
— IndianPremierLeague (@IPL) April 8, 2023
అర్షద్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో 6 రన్స్ వచ్చాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(2), అజింక్యా రహానే(4) క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లకు చెన్నై స్కోర్.. 14/1
చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్.. జాసన్ బెహ్రెండార్ఫ్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ డేవాన్ కాన్వే(0) డకౌట్ అయ్యాడు. దాంతో, ఖాతా తెరవకుండానే చెన్నై తొలి వికెట్ కోల్పోయింది.
ఐపీఎల్ 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 157 పరుగులు చేసింది. ప్రిటోరియస్ వేసిన ఆఖరి ఓవర్లో హృతిక్ ష్లోకీన్ (18) మూడు బౌండరీలు కొట్టాడు. దాంతో, ముంబై స్కోర్ 150 దాటింది. ఇషాన్ కిషన్(31), తిలక్ వర్మ(22), టిమ్ డేవిడ్ (31) మాత్రమే రాణించారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. శాంట్నర్, తుషార్ దేశ్‌పాండే తలా రెండు వికెట్లు తీశారు. సిసండ మగలకు ఒక వికెట్ దక్కింది.
Tim David's entertaining 31-run cameo comes to end!
But the @mipaltan batter adds some crucial runs down the order 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/i82aC1pXCq
— IndianPremierLeague (@IPL) April 8, 2023
ముంబై 19 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. మగల బౌలింగ్‌లో 6 పరుగులు వచ్చాయంతే. పీయూష్ చావ్లా (4), హృతిక్ ష్లోకీన్ (6) క్రీజులో ఉన్నారు.
ముంబై ఆలౌట్ ప్రమాదంలో పడింది. దంచి కొడుతున్న టిమ్ డేవిడ్ (31) ఔటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన 18వ ఓవర్లో వరుసగా ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన అతను రహానే క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
ముంబై ఇండియన్స్ ఏడో వికెట్ పడింది. ట్రిట్సన్ స్టబ్స్(5) మగల బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, ముంబై మరింత కష్టాల్లో పడింది.
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ మరో వికెట్ కోల్పోయింది. 18 బంతుల్లో 22 పరుగులతో జోరుమీదున్న తిలక్ వర్మ.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబయి ఆరు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
11 ఓవర్లకు ముంబై 87 పరుగులు చేసింది. తిలక్ వర్మ(13), టివ్ డేవిడ్ (4) క్రీజులో ఉన్నారు.
ముంబై ఐదో వికెట్ పడింది. శాంట్నర్ బౌలింగ్‌లో అర్షద్ ఖాన్(2) ఎల్బీగా ఔటయ్యాడు. సగం వికెట్లు పడడంతో ముంబై కష్టాల్లో ఉంది. తిలక్ వర్మ(6), టివ్ డేవిడ్ (2) క్రీజులో ఉన్నారు. 9.1 ఓవర్లకు ముంబై స్కోర్.. 76/5
రవీంద్ర జడేజా రెండో వికెట్ తీశాడు. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(12)ను రిచర్న్ క్యాచ్ పట్టి ఔట్ చేశాడు. దాంతో, ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ క్రీజులో ఉన్నాడు. 8.2 ఓవర్లకు ముంబై స్కోర్.. 73/4
ముంబై మూడో వికెట్ కోల్పోయింది. శాంట్నర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్(1) క్యాచ్ ఔటయ్యాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో చెన్నై రివ్యూ తీసుకుంది. రివ్యూలో బంతి గ్లోవ్స్‌కు తాకడంతో అంపైర్ సూర్యను ఔట్‌గా ప్రకటించాడు. కామెరూన్ గ్రీన్(10), తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
Two MASSIVE wickets in quick succession! 🙌🏻#MI 3️⃣ down as they lose Ishan Kishan and Suryakumar Yadav.
Ravindra Jadeja and Mitchell Santner with the breakthroughs 👌🏻
Follow the match ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/VaPYd5S1Jc
— IndianPremierLeague (@IPL) April 8, 2023
రవీంద్ర జడేజా బిగ్ వికెట్ తీశాడు. ధాటిగా ఆడుతున్న ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(31)ను ఔట్ చేశాడు. ఇషాన్ గాల్లోకి లేపిన బంతిని బౌండరీ వద్ద ప్రిటోరియస్ అందుకున్నాడు. దాంతో, 64 వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్(10), సూర్యకుమార్ యాదవ్(1) క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లకు ముంబై స్కోర్.. 66/2.
ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(31) ధాటిగా ఆడుతున్నాడు. మగల వేసిన ఐదో ఓవర్లో అతను వరుసగా రెండు బౌండరీలు బాదాడు. కామెరూన్ గ్రీన్(7) క్రీజులో ఉన్నాడు. పవర్ ప్లేలో ముంబై స్కోర్.. 61/1.
.@ishankishan51 leading @mipaltan's charge 💪🏻#MI move along nicely with 61/1 after 6 overs 🔥
Follow the match ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/PrzqcWdUlT
— IndianPremierLeague (@IPL) April 8, 2023
ముంబై ఇండియన్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ(21) బౌల్డ్ అయ్యాడు. తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన అతను ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఇషాన్ కిషన్(15) క్రీజులో ఉన్నాడు. 4 ఓవర్లకు ముంబై స్కోర్.. 38/1.
ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ(14), ఇషాన్ కిషన్(14) ధాటిగా ఆడుతున్నారు. సిసాండ మగల బౌలింగ్‌లో ఇషాన్ మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో, 14 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లకు ముంబై స్కోర్.. 30/0
దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ శర్మ(9) రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో, 10 పరుగులు వచ్చాయిఇషాన్ కిషన్(1) క్రీజులో ఉన్నాడు..
ముంబై సబ్స్టిట్యూట్స్ : నేహల్ వధేరా, సందీప్ వారియర్, కార్తికేయ సింగ్, రమన్‌దీప్ సింగ్, అర్జున్ టెండూల్కర్.
సీఎస్కే సబ్స్టిట్యూట్స్ : అంబటి రాయుడు, షేక్ రషీద్, రాజవర్ధన్ హంగర్గేకర్, అకాశ్ సింగ్, సుభ్రాన్షు సేనాపతి.
A look at the Playing XIs of the two sides 👌👌
Follow the match ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/a51eDVSMBG
— IndianPremierLeague (@IPL) April 8, 2023
A look at the Playing XIs of the two sides 👌👌
Follow the match ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/a51eDVSMBG
— IndianPremierLeague (@IPL) April 8, 2023
మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచాడు. ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ అప్పగించాడు.
17 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 129 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్(62), అభిషేక్ పొరెల్(2) క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 70 పరుగులు కావాలి.