ipl 2023 SRH Vs RR | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. కెప్టెన్‌గా నియామకమైన ఐడెన్ మార్క్రమ్ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్ భూవీ వ్యవహరించనున్నాడు.
హైదరాబాద్ జట్టు : మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ (WK), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), టీ నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ.
రాజస్థాన్ జట్టు : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కెఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. సొంతగడ్డపై హైదరాబాద్ బ్యాటర్లు విఫలం అయ్యారు. దాంతో, వంద లోపై ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, అబ్దుల్ సమద్ (32),ఉమ్రాన్ మాలిక్ (19) చివర్లో ధాటిగా ఆడడంతో 130 ప్లస్ స్కోర్ చేసింది. సైనీ వేసిన ఆఖరి ఓవర్లో సమద్ రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు, ఒక ఫోర్.. ఉమ్రాన్ మాలిక్ ఒక సిక్స్ కొట్టారు. దాంతో 23 రన్స్ వచ్చాయి. వీళ్లు ఆఖర్లో చెలరేగడంతో హైదరాబాద్ 20 ఓవర్లకు 131 రన్స్ చేయగలిగింది.
హైదరాబాద్ స్కోర్ వంద పరుగులకు చేరింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన 18వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. హైదరాబాద్ స్కోర్ .. 108-8.
చాహల్ మూడో వికెట్ తీశాడు. భువనేశ్వర్ కుమార్(6)ను బౌల్డ్ చేశాడు. దాంతో, 95 రన్స్ వద్ద హైదరాబాద్ ఎనిమిదో వికెట్ పడింది. అబ్దుల్ సమద్ (16), ఉమ్రాన్ మాలిక్ క్రీజులో ఉన్నారు.
హైదరాబాద్ జట్టు 15 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి రన్స్ చేసింది. భువనేశ్వర్ కుమార్(2), అబ్దుల్ సమద్ (13), క్రీజులో ఉన్నా రు. అశ్విన్ వేసిన రెండో బంతికి భువీ స్టంపౌట్‌కు రాజస్థాన్ అప్పీల్ చేసింది. కానీ, భువీ కాలు క్రీజు లోపలే ఉండడంతో బతికిపోయాడు. హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో115 పరుగులు కావాలి.
హైదరాబాద్ ఏడో వికెట్ పడింది. చాహల్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ (18) స్టంపౌట్ అయ్యాడు. ఫ్రంట్‌ఫుట్ వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయింది. బంతి అందుకున్న శాంసన్ వికెట్లను గిరాటేశాడు. దాంతో, 81 రన్స్ వద్ద హైదరాబాద్ 7వ వికెట్ కోల్పోయింది.
Easy as you like 😉@yuzi_chahal wins the battle of the spinners 👌👌
Follow the match ▶️ https://t.co/khh5OBILWy#TATAIPL | #SRHvRR pic.twitter.com/7yIPE3juHm
— IndianPremierLeague (@IPL) April 2, 2023
పదమూడో ఓవర్లో సైనీ రెండు నో బాల్స్ వేయడంతో రెండు ఫ్రీ హిట్స్ వచ్చాయి. లో ఫుల్‌టాస్ అయిన రెండో ఫ్రీ హిట్‌ను రషీద్ (13) బౌండరీకి తరలించాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. సమద్ (7) క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 75/6 . హైదరాబాద్ విజయానికి 42 బంతుల్లో129 పరుగులు కావాలి.
రాజస్థాన్ జట్టు ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీని తీసుకుంది. 10వ ఓవర్ తర్వాత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ స్థానంలో అతడు మైదానంలోకి వచ్చాడు.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్(27) ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో, హైదరాబాద్ మరింత కష్టాల్లో పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్(2), ఆదిల్ రషీద్ క్రీజులో ఉన్నారు.
హైదరాబాద్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిఫ్స్ (8) ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో అసిఫ్ క్యాచ్ పట్టడంతో అతను పెవిలియన్ చేరాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(25), ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్ క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 48/5. హైదరాబాద్ విజయానికి 60 బంతుల్లో156 పరుగులు కావాలి.
In the air and taken!
Wicket number 4️⃣ for @rajasthanroyals and it's @Jaseholder98 with the breakthrough this time ✅
Washington Sundar departs.
Follow the match ▶️ https://t.co/khh5OBILWy#TATAIPL | #SRHvRR pic.twitter.com/u130vITgBq
— IndianPremierLeague (@IPL) April 2, 2023
హైదరాబాద్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్(1) ఔటయ్యాడు. హోల్డర్ బౌలింగ్‌లో మిడాన్‌లో హెట్మెయిర్ క్యాచ్ పట్టడంతో అతను పెవిలియన్ చేరాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(24) క్రీజులో ఉన్నాడు. 8.2 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 39/4. హైదరాబాద్ విజయానికి 70 బంతుల్లో165 పరుగులు కావాలి.
ఎనిమిది ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 38/3. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(23), వాషింగ్టన్ సుందర్(1) క్రీజులో ఉన్నారు. ఆసిఫ్ వేసిన ఓవర్లో కేవలం 4 రన్స్ వచ్చాయంతే. 34 రన్స్‌కే ముగ్గురు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది.
యజువేంద్ర చాహల్ బిగ్ వికెట్ తీశాడు. హ్యారీ బ్రూక్ (13)నుబౌల్డ్ చేశాడు. దాంతో, 34 రన్స్ వద్ద హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(21), వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. బ్రూక్, మయాంక్ ఇద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్‌బోర్డు వేగం పెంచారు. మూడో వికెట్‌కు 34 రన్స్ జోడించారు.
పవర్ ప్లేలో హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 30 రన్స్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ఓవర్ ఆఖరి బంతికి మయాంక్ అగర్వాల్(20 బౌండరీ కొట్టాడు. దాంతో, 10 రన్స్ వచ్చాయి. హ్యారీ బ్రూక్ 10 పరుగులతో ఆడుతున్నాడు.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13) ధాటిగా ఆడుతున్నాడు. జేసన్ హోల్డర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించాడు. అంతకుముందు బౌల్ట్ ఓవర్లోనూ ఒక ఫోర్ కొట్టాడు. హ్యారీ బ్రూక్ (4) క్రీజులో ఉన్నాడు.4 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..17/2.
ఉప్పల్ స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలో హీరో విక్టరీ వెంకటేశ్ సందడి చేస్తున్నాడు. హైదరాబాద్ టీమ్ జెండా ఊపుతూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతున్నాడు. కెమెరావాళ్లు వెంకీని బిగ్ స్క్రీన్‌పై చూపించడంతో అభిమానులంతా వెంకీ.. వెంకీ.. అంటూ అరిచారు.
రెండు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..7/2. అసిఫ్ వేసిన రెండో ఓవర్లో హ్యారీ బ్రూక్ (4) బౌండరీ కొట్టాడు. దాంతో, రన్స్ వచ్చాయి. మయాంక్ అగర్వాల్()3 క్రీజులో ఉన్నాడు.
ట్రెంట్ బౌల్ట్ దెబ్బకు హైదరాబాద్ జట్టు తొలి ఓవర్లోనే రెండో వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఐదో బంతికి అతను ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో హోల్డర్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే.. త్రిపాఠి రివ్యూ తీసుకున్నాడు. కానీ, రివ్యూలో కూడా ఔట్ అని తేలింది. దాంతో, ఖాతా తెరవడకుండానే హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయింది. మూడో మూడో బంతిని డిఫెండ్ చేయబోయి ఓపెనర్ అభిషేక్ శర్మ(0) బౌల్డ్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు షాక్. ఓపెనర్ అభిషేక్ శర్మ(0) డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ మూడో బంతిని డిఫెండ్ చేయబోయి బౌల్డ్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ 203 పరుగులు చేసింది. ఫారుఖీ వేసిన 20వ ఓవర్లో షిమ్రాన్ హెట్మెయిర్(22) ఫోర్ కొట్టి స్కోర్ రెండొందలు దాటించాడు. దాంతో, ఆ జట్టు హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(55 ఔటయ్యాడు. నటరాజన్ వేసిన 19వ ఓవర్లో అతను భారీ షాట్ ఆడాడు. అయితే.. బౌండరీ వద్ద అభిషేక్ శర్మ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో అతడు వెనుదిరిగాడు.
రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. భువీ వేసిన ఆ ఓవర్లో షిమ్రాన్ హెట్మెయిర్(10) సిక్స్, సంజూ శాంసన్(55) బౌండరీ కొట్టారు. దాంతో, 13 రన్స్ వచ్చాయి.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(50) అర్ధ శతకం బాదాడు. నటరాజన్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన అతను 28 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. షిమ్రాన్ హెట్మెయిర్(1) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది.
Captain leading from the front & how! 👍 👍
A 28-ball FIFTY for @IamSanjuSamson 👏 👏
Follow the match ▶️ https://t.co/khh5OBILWy #TATAIPL | #SRHvRR | @rajasthanroyals pic.twitter.com/cMgpDnUgJx
— IndianPremierLeague (@IPL) April 2, 2023
రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ పడింది. రియాన్ పరాగ్(7)ను నటరాజన్ ఔట్ చేశాడు. పరాగ్ గాల్లోకి లేపిన బంతిని ఫారూఖీ అందుకున్నాడు. దాంతో, 170 రన్స్ వద్ద రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సంజూ శాంసన్(49) అర్ధ శతకానికి ఒక పరుగు దూరంలో ఉన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ 16 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్(49) అర్ధ శతకానికి ఒక పరుగు దూరంలో ఉన్నాడు. రియాన్ పరాగ్(7) క్రీజులో ఉన్నాడు. ఆదిల్ రషీద్ వేసిన 16వ ఓవర్ తొలి బంతిని శాంసన్ స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ తర్వాతి బంతికి మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. కానీ, ఫారుఖీ అడ్డుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ పడింది. దేవ్‌దత్ పడిక్కల్(2)ను ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేశాడు. 15వ ఓవర్ తొలి బంతిని డిఫెన్స్ చేయబోయిన పడిక్కల్ ఔటయ్యాడు. 151 రన్స్ వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సంజూ శాంసన్(39), రియాన్ పరాగ్ క్రీజులో ఉన్నారు.
T. I. M. B. E. R! @umran_malik_01 scalps his first wicket of the match 👌 👌#RR three down as Devdutt Padikkal departs.
Follow the match ▶️ https://t.co/khh5OBILWy#TATAIPL | #SRHvRR pic.twitter.com/nE4MAUiOM5
— IndianPremierLeague (@IPL) April 2, 2023
ఫజల్హక్ ఫారుఖీ మళ్లీ చెలరేగాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (54) ఔట్ చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న సంజూ శాంసన్(30), యశస్వీ జోడీని విడదీశాడు. 13వ ఓవర్ మూడో బంతికి మిడాఫ్‌లో భారీ షాట్ ఆడాడు. మయాంక్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టడంతో యశస్వీ వెనుదిరిగాడు. దాంతో, 54 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (39) హాఫ్ సెంచరీ కొట్టాడు. 34 బంతుల్లోనే అతను ఫీఫ్టీకి చేరువయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్(30)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. 12 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 135/1.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు యశస్వీ(46), శాంసన్(21) ధాటిగా ఆడుతున్నారు. ఉమ్రాన్ బౌలింగ్‌లో శాంసన్ సిక్స్ బాదాడు. ఆ ఓవర్లో 12 రన్స్ వచ్చాయి. 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 122 రన్స్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్ స్కోర్ వందకు చేరింది. సంజూ శాంసన్(11) ఉమ్రాన్ మాలిక్ ఓవర్లో బౌండరీ కొట్టడంతో ఆ జట్టు వంద పరుగులకు చేరువైంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (39) క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు వికెట్ నష్టానికి 105 రన్స్ చేసింది.
రాజస్థాన్ రాయల్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో జోరుమీదున్న జోస్ బట్లర్‌ను బౌలర్ ఫారూకీ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లకు రాజస్థాన్ వికెట్ నష్టానికి 86 పరుగులు సాధించింది.
Farooqi
రాజస్థాన్ బ్యాటర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విరుచుకుపడుతున్నారు. కేవలం ఐదు ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ 73 పరుగులు చేసింది. జోస్ బట్లర్, జైస్వాల్ క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 30, జోస్ బట్లర్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు.
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో జట్టు 54 పరుగులు చేసింది. ఇందులో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. జైస్వాల్ 13 బంతుల్లో 30, జోస్ బట్లర్ 11 బంతుల్లో 25 పరుగులు చేశారు.
టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ధాటిగానే ఆడుతున్నది. రెండో ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 20 పరుగులు చేసింది. జోస్ బట్లర్, జైస్వాల్ హైదరాబాద్ బౌలర్లపై జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు.
భారత క్రికెట్ దిగ్గజం సలీమ్ దురానీ ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మ్యాచ్ ప్రారంభానికి ముందు నివాళులర్పించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తూ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భువనేశ్వర్ కుమార్‌ను జట్టు సభ్యులు అభినందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ వేదికగా విడుదల చేసింది.
Game recognises Game 😎@DaleSteyn62 @BhuviOfficial | #SRHvRR #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/ebFSe3SHPf
— SunRisers Hyderabad (@SunRisers) April 2, 2023
మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మ్యాచ్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది బలగాలను మోహరించారు. భద్రతను సీపీ డీఎస్ చౌహాన్ పర్యవేక్షిస్తున్నారు.