హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి పోరుకు సిద్ధమైంది. ఆదివారం సొంత ఇలాఖాలో నిరుటి రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. క్రితంతో పోలిస్తే జట్టులో భారీ మార్పులు చేసిన రైజర్స్ ఎలాగైనా బోణీ కొట్టాలన్న పట్టుదలతో కనిపిస్తుంటే రాయల్స్ తమ మ్యాజిక్‌ను కొనసాగించాలని చూస్తున్నది. మరోవైపు శాంసన్ కెప్టెన్సీలో రాయల్స్ తమ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నది.