IPL 2023 : టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ చాంపియన్ ఆటతో అదరగొట్టింది. సొంత గ్రౌండ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 34 పరుగులతో చిత్తుగా ఓడించింది. భారీ విజయంతో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. మొదట ఓపెనర్ శుభ్‌మన్ గిల్(101) సెంచరీతో చెలరేగడంతో 9 వికెట్ల నష్టానికి 188 పరగులు కొట్టింది. ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు చేతులెత్తేశారు. హెన్రిచ్ క్లాసెన్(64 : 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)ఒంటరి పోరాటం చేసినా సరిపోలేదు. ఎనిమిదో ఓటమితో మరక్రం సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది.
𝗣𝗹𝗮𝘆𝗼𝗳𝗳𝘀 𝗦𝗽𝗼𝘁 𝗦𝗲𝗮𝗹𝗲𝗱! ✅
Presenting the first team to qualify for the #TATAIPL playoffs! #GTvSRH
𝗚𝗨𝗝𝗔𝗥𝗔𝗧 𝗧𝗜𝗧𝗔𝗡𝗦 👏🏻👏🏻 pic.twitter.com/1std84Su6y
— IndianPremierLeague (@IPL) May 15, 2023
రాహుల్ తెవాటియా వేసిన 20వ ఓవర్లో మార్కండే(17) ఫోర్ బాదాడు. దాంతో,7 రన్స్ వచ్చాయి. ఫారుఖీ(1) నాటౌట్‌గా నిలిచాడు. దాంతో, హైదరాబాద్ 154 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ 34 రన్స్‌తో గెలిచి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ ఓటమితో హైదరాబాద్ టోర్నీకి ముగింపు పలికింది.
హైదరాబాద్ ఆలౌట్ ప్రమాదంలో ఉంది. మోహిత్ శర్మ ఓవర్లో భువనేశ్వర్(27) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ పరుగెత్తుతూ వచ్చి క్యాచ్ పట్టాడు. ఫారుఖీ వచ్చాడు. మరోవైపు మార్కండే(12) దంచుతున్నాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. 19 ఓవర్లకు స్కోర్..147/9
హాఫ్ సెంచరీ బాదిన హెన్రిచ్ క్లాసెన్(64) ఔటయ్యాడు. షమీ ఓవర్లో షాట్ ఆడి మిల్లర్ చేతికి చిక్కాడు. దాంతో, హైదరాబాద్ ఎనిమిదో వికెట్ పడింది. మార్కండే వచ్చాడు. భువనేశ్వర్(20) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లకు స్కోర్..127/8
కష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్(50) హాఫ్ సెంచరీ బాదాడు. నూర్ అహ్మద్ ఓవర్లో ఫిఫ్టీ సాధించాడు. 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను అర్ధ శతకం కొట్టాడు. భువనేశ్వర్(16) క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు స్కోర్.. 104/7
నూర్ అహ్మద్ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్(39) సిక్స్ బాదాడు. భువనేశ్వర్(5) ఫోర్ కొట్టాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. 13 ఓవర్లకు స్కోర్.. 97/7
ఫామ్‌లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్(39) దంచుతున్నాడు. నూర్ అహ్మద్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌గా మలిచాడు. దాంతో, 10 రన్స్ వచ్చాయి. భువనేశ్వర్(5) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు స్కోర్.. 80/7
మోహిత్ శర్మ మూడో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. జాన్సేన్(3)ను ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. దాంతో, 59 వద్ద హైదరాబాద్ ఏడో వికెట్ పడింది. భువనేశ్వర్ వచ్చాడు. హెన్రిచ్ క్లాసెన్(23) క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 59/7
హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మోహిత్ శర్మ వేసిన 7వ ఓవర్లో అబ్దుల్ సమద్(4) ఔటయ్యాడు. వచ్చీ రాగానే ఫోర్ కొట్టిన అతను మిడాన్‌లో శివం మావి చేతికి చిక్కాడు. తొలి బంతికి సన్వీర్ సింగ్(7)ఔటయ్యాడు. 7 ఓవర్లకు స్కోర్.. 50/6.
He gets his third 😎#SRH lose Marco Jasen's wicket and they are 7️⃣ down now.
Follow the match ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH https://t.co/iTF0eNKQeW
— IndianPremierLeague (@IPL) May 15, 2023
హైదరాబాద్ మరింత కష్టాల్లో పడింది. మోహిత్ శర్మ వేసిన 7వ ఓవర్లో సన్వీర్ సింగ్(7)ఔటయ్యాడు. అతను కొట్టిన బంతిని బౌండరీ వద్ద సుదర్శన్ అందుకున్నాడు. దాంతో, 50 లోపే సగం వికెట్లు కోల్పోయింది. అబ్దుల్ సమద్ వచ్చాడు. హెన్రిచ్ క్లాసెన్(16) క్రీజులో ఉన్నాడు. 6.2 ఓవర్లకు స్కోర్.. 49/5
రషీద్ ఖాన్ వేసిన 6వ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్(16) సిక్స్ బాదాడు. దాంతో, 10 రన్స్ వచ్చాయి. సన్వీర్ సింగ్(7) క్రీజులో ఉన్నాడు. దాంతో, హైదరాబాద్ పవర్ ప్లేలో 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు స్కోర్ చేసింది.
హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. షమీ ఓవర్లో కెప్టెన్ మరక్రం(10) ఔటయ్యాడు. దసున్ షనకకు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సన్వీర్ సింగ్ వచ్చాడు. హెన్రిచ్ క్లాసెన్(7) క్రీజులో ఉన్నాడు.
యశ్ దయాలో ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్(7), కెప్టెన్ మరక్రం(10) చెరొక ఫోర్ క్టారు. 4 ఓవర్లకు స్కోర్.. 29/3
హైదరాబాద్ మూడో వికెట్ పడింది. షమీ ఓవర్లో రాహుల్ త్రిపాఠి(1) ఔటయ్యాడు. తెవాటియా క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. హెన్రిచ్ క్లాసెన్ వచ్చాడు. కెప్టెన్ మరక్రం(0) క్రీజులో ఉన్నాడు.
Not the ideal start to the chase for Sunrisers Hyderabad!
They lose 3️⃣ wickets inside the powerplay.
Follow the match ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH pic.twitter.com/2DQMZJUnqh
— IndianPremierLeague (@IPL) May 15, 2023
హైదరాబాద్‌కు షాకిచ్చిన యశ్ దయాల్. అభిషేక్ శర్మ(4)ను ఔట్ చేశాడు. కీపర్ సాహా క్యాచ్ పట్టడంతో హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి వచ్చాడు. కెప్టెన్ మరక్రం(0) క్రీజులో ఉన్నాడు.
హైదరాబాద్‌కు షాక్.. ఓపెనర్ అన్మోల్ ప్రీత్ సింగ్(5) ఔటయ్యాడు. షమీ ఓవర్లో ఐదో బంతికి రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు దాంతో, 6 రన్స్ వద్ద ఆరెంజ్ ఆర్మీ తొలి వికెట్ పడింది. కెప్టెన్ మరక్రం వచ్చాడు.. అభిషేక్ శర్మ(0) క్రీజులో ఉన్నాడు.
భువనేశ్వర్ వేసిన 20వ ఓవర్లో గుజరాత్ 4 వికెట్లు పడ్డాయి. తొలి బంతికి సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్(101) ఔటయ్యాడు. రెండో బంతికి రషీద్ ఖాన్ వెనుదిరిగాడు. హ్యాట్రిక్ బాల్‌కు నూర్ అహ్మద్ రనౌటయ్యాడు. నాలుగో బంతికి షమీ ఔటయ్యాడు. ఆఖరి బంతికి మోహిత్ శర్మ సింగిల్ తీయడంతో గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది.
డేంజరస్ రాహుల్ తెవాటియా(3) ఔటయ్యాడు. దాంతో గుజరాత్ సగం వికెట్లు కోల్పోయింది. ఫారుఖీ ఓవర్లో బౌండరీ వద్ద జాన్సెన్ క్యాచ్ పట్టడంతో తెవాటియా వెనుదిరిగాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న దసున్ షనక వచ్చాడు. శుభ్‌మన్ గిల్(98 ) సెంచరీకి చేరువగా ఉన్నాడు.
గుజరాత్ పెద్ద వికెట్ పడింది. డేంజరస్ డేవిడ్ మిల్లర్(7) ఔటయ్యాడు. నటరాజన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన మిల్లర్ బౌండరీ వద్ద మరక్రం చేతికి చిక్కాడు. రాహుల్ తెవాటియా వచ్చాడు. శుభ్‌మన్ గిల్(96) సెంచరీకి చేరువగా ఉన్నాడు.
భువనేశ్వర్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (8) ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి క్యాచ్ పట్టడంతో పాండ్యా వెనుదిరిగాడు. దాంతో, 156 రన్స్ వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ వచ్చాడు. శుభ్‌మన్ గిల్(90) ఆడుతున్నాడు.
హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న సాయి సుదర్శన్(47) ఔటయ్యాడు. జాన్సేన్ ఓవర్లో నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 147 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. హార్దిక్ పాండ్యా వచ్చాడు. శుభ్‌మన్ గిల్(89) ఆడుతున్నాడు. 14.3 ఓవర్లకు స్కోర్.. 147/2.
గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(64), సాయి సుదర్శన్(31) ధాటిగా ఆడుతున్నారు. మార్కండే ఓవర్లో ఆఖరి బంతికి సుదర్శన్ బౌండరీ బాదాడు. దాంతో, గుజరాత్ స్కోర్ వంద దాటింది. 10 ఓవర్లకు స్కోర్.. 103/1.
ధనాధన్ ఆడుతున్న గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(52) హాఫ్ సెంచరీ కొట్టాడు. నటరాజన్ ఓవర్లో బౌండరీతో యాభై రన్స్ బాదాడు. 22 బంతుల్లో 9 ఫోర్లతో అతను ఫిప్టీకి చేరువయ్యాడు. ఈ సీజన్లో అతడికి ఇది ఐదో అర్ధ శతకం. సాయి సుదర్శన్(22) ఆడుతున్నాడు.
5️⃣0️⃣ off just 22 deliveries 😎@ShubmanGill is dealing in boundaries at the moment for @gujarat_titans 🔥🔥
Follow the match ▶️ https://t.co/GH3aM3h0ER #TATAIPL | #GTvSRH pic.twitter.com/4R9zQJZ4yi
— IndianPremierLeague (@IPL) May 15, 2023
పవర్ ప్లేలో గుజరాత్ బ్యాటర్లు చెలరేగారు. దాంతో, వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. నటరాజన్ వేసిన నాలుగో ఓవర్లో ఓపెనర్ సాయి సుదర్శన్(21), శుభ్‌మన్ గిల్(36) ఒక ఫోర్ కొట్టారు. దాంతో10 పరుగులు వచ్చాయి.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్(28) వేగం పెంచాడు. ఫారుఖీ వేసిన నాలుగో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. మూడు, నాలుగు, ఐదు, ఆరు బంతుల్ని బౌండరీకి తరలించాడు. దాంతో, గుజరాత్ స్కోర్ 50కి చేరింది. సాయి సుదర్శన్(14) ఆడుతున్నాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 50/1.
సాయి సుదర్శన్(14), శుభ్‌మన్ గిల్(10) దంచుతున్నారు. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో చెరొక ఫోర్ కొట్టాడు. మూడు ఓవర్లకు స్కోర్.. 32/1.
జాన్సేన్ వేసిన రెండో ఓవర్లో సాయి సుదర్శన్(6) ఫోర్ కొట్టాడు. ఆఖరి బంతికి ఫ్రీ హిట్ వచ్చింది. ఆ తర్వాత వైడ్, మళ్లీ వైడ్ బాల్ బౌండరీ వెళ్లడంతో12 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్(3) ఆడుతున్నాడు. రెండు ఓవర్లకు స్కోర్.. 17/1.
గుజరాత్‌కు షాక్. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(0) ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ మరక్రం బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.