IPL 2023 : గుజరాత్‌కు షాకిచ్చిన ఢిల్లీ. ఇషాంత్ వేసిన 20వ ఓవర్లో 12 పరుగులు కావాలి. నాలుగో బంతికి రాహుల్ తెవాటియా(20) ఔటయ్యాడు. రషీద్ ఖాన్(2) రెండు రన్స్ తీశాడు. ఆఖరి బంతికి 7 రన్స్ అవసరమయ్యాయి. రషీద్ ఒక్క పరుగు తీశాడంతే. దాంతో, ఢిల్లీ 5 పరుగుల తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్యా(59) నాటౌట్‌గా నిలిచాడు.
ఇషాంత్ వేసిన 20వ ఓవర్లో రాహుల్ తెవాటియా(20) ఔటయ్యాడు. రషీద్ ఖాన్(2) రెండు రన్స్ తీశాడు. ఆఖరి బంతికి 7 రన్స్ అవసరమయ్యాయి. రషీద్ ఒక్క పరుగు తీశాడంతే. దాంతో, ఢిల్లీ 5 పరుగుల తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్యా(59) నాటౌట్‌గా నిలిచాడు.
నార్జ్ ఓవర్లో హార్దిక్ పాండ్యా(56) రెండు రన్స్ తీశాడు. దాంతో, గుజరాత్ స్కోర్ వంద దాటింది. రాహుల్ తెవాటియా(20) మూడు సిక్స్‌లు కొట్టాడు. 19 ఓవర్లకు స్కోర్.. 119/5. గుజరాత్ విజయానికి 6 బంతుల్లో12 పరుగులు కావాలి.
గుజరాత్ ఐదో వికెట్ పడింది. అభినవ్ మనోహర్(26) ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అమన్ ఖాన్ చేతికి చిక్కాడు. దాంతో, 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ తెవాటియా వచ్చాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న హార్దిక్ పాండ్యా(51) క్రీజులో ఉన్నాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న హార్దిక్ పాండ్యా(49) హాఫ్ సెంచరీ సాధించాడు. కుల్దీప్ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో 7 ఫోర్లతో పాండ్యా 50 రన్స్ కొట్టాడు.
నార్జ్ ఓవర్లో హార్దిక్ పాండ్యా(49) బౌండరీ కొట్టాడు. దాంతో ఐదో వికెట్‌కు అభినవ్ మనోహర్(23)తో కలిసి 50 రన్స్ జోడించాడు. 16 ఓవర్లకు స్కోర్.. 89/4. గుజరాత్ విజయానికి 24 బంతుల్లో42 పరుగులు కావాలి.
Fifty partnership!
Captain @hardikpandya7 & Abhinav Manohar bring up a timely 5️⃣0️⃣-run partnership 🔥🔥#GT need 42 off 24 now
Follow the match ▶️ https://t.co/VQGP7wSrKL #TATAIPL | #GTvDC pic.twitter.com/KJy4ASAJ2I
— IndianPremierLeague (@IPL) May 2, 2023
హార్దిక్ పాండ్యా(42) వేగం పెంచాడు. అక్షర్ పటేల్ ఓవర్లో బౌండరీ కొట్టాడు. అభినవ్ మనోహర్(20) నిలకడగా ఆడుతున్నాడు. 15 ఓవర్లకు స్కోర్.. 78/4. గుజరాత్ విజయానికి 30 బంతుల్లో 52 పరుగులు కావాలి.
హార్దిక్ పాండ్యా(36), అభినవ్ మనోహర్(19) నిలకడగా ఆడుతున్నారు. ఖలీల్ అహ్మద్ ఓవర్లో పాండ్యా బౌండరీ కొట్టాడు. 14 ఓవర్లకు స్కోర్.. 71/4. గుజరాత్ విజయానికి 36 బంతుల్లో 60 పరుగులు కావాలి.
కుల్దీప్ ఓవర్లో 4 రన్స్ వచ్చాయి. హార్దిక్ పాండ్యా(28) అభినవ్ మనోహర్(15) ఆడుతున్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 59/4.
అక్షర్ పటేల్ ఓవర్లో అభినవ్ మనోహర్(11) సిక్స్ కొట్టాడు. హార్దిక్ పాండ్యా(24) ఆడుతున్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 49/4.
కుల్దీప్ యాదవ్ బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ డేవిడ్ మిల్లర్(0)ను బౌల్డ్ చేశాడు. దాంతో, గుజరాత్ నాలుగో వికెట్ పడింది. హార్దిక్ పాండ్యా(18), అభినవ్ మనోహర్ ఆడుతున్నారు.
పవర్ ప్లేలో ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. మూడు వికెట్లు తీశారు. డేవిడ్ మిల్లర్(0), హార్దిక్ పాండ్యా(18) ఆడుతున్నారు. 5 ఓవర్లకు స్కోర్.. 31/3.
గుజరాత్ మూడో వికెట్ పడింది. ఇషాంత్ శర్మ ఓవర్లో విజయ్ శంకర్(6) ఔల్డయ్యాడు. మూడో బంతికి బౌండరీ బాదిన అతను ఆఖరి బంతికి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా(13) ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 26/3.
Deception at its best! 👊🏻
What a ball that from @ImIshant 🔥🔥#GT have lost four wickets now and this is turning out to be a tricky chase!
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/j7IlC7vf0X
— IndianPremierLeague (@IPL) May 2, 2023
గుజరాత్ రెండో వికెట్ పడింది. అన్రిచ్ నార్జ్ ఓవర్లో మొదటి బంతికే శుభ్‌మన్ గిల్(6) ఔటయ్యాడు. మనీశ్ పాండే చేతికి చిక్కి వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా(12) ఆడుతున్నాడు.
హార్దిక్ పాండ్యా(12) దూకుడు పెంచాడు. ఖలీల్ అహ్మద్ ఓవర్లో మూడు బౌండరీలు కొట్టాడు. శుభ్‌మన్ గిల్(6) ఆడుతున్నాడు. 3 ఓవర్లకు స్కోర్.. 18/1.
ఇషాంత్ శర్మ ఓవర్లో శుభ్‌మన్ గిల్(6) బౌండరీ కొట్టాడు. హార్దిక్ పాండ్యా(0) ఉన్నాడు. 2 ఓవర్లకు స్కోర్.. 6/1.
గుజరాత్‌కు షాక్.. తొలి ఓవర్లోనే వికెట్ పడింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి వృద్ధిమాన్ సాహా(0)
ఔటయ్యాడు. దాంతో, ఖాతా తెరకుండానే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్(0) ఉన్నాడు.
Just the start @DelhiCapitals needed!
A wicket-maiden to get things going 😎
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/rIPwZD9qOE
— IndianPremierLeague (@IPL) May 2, 2023
మోహిత్ శర్మ వేసిన 20వ ఓవర్లో రిపల్ పటేల్(23) ఔటయ్యాడు. ఐపీఎల్లో మోహిత్‌కు ఇది వందో వికెట్. దాంతో ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
హాఫ్ సెంచరీ కొట్టిన అమన్ హకీం ఖాన్(51) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన అతను అభినవ్ మనోహర్ చేతికి చిక్కాడు. దీంతో, ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. రిపల్ పటేల్(22), అన్రిచ్ నార్జ్ ఆడుతున్నారు.
అమన్ హకీం ఖాన్(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. కష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన అతను 41 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. మోహిత్ శర్మ ఓవర్లో సిక్స్, డబుల్స్ తీసి 50 రన్స్ స్కోర్ చేశాడు.
జోషువా లిటిల్ ఓవర్లో రిపల్ పటేల్(14), అమన్ ఖాన్(40) చెరొక ఫోర్ బాదారు. దాంతో, ఢిల్లీ స్కోర్ 100 దాటింది. ఆఖరి బంతికి రిపల్ బౌండరీ బాదాడు. 16 ఓవర్లకు స్కోర్..107/6.
మోహిత్ శర్మ ఓవర్లో అమన్ ఖాన్(35) ఫోర్, సిక్స్ బాదాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. రిపల్ పటేల్(2) ఆడుతున్నాడు. 16 ఓవర్లకు స్కోర్.. 91/6.
రషీద్ ఖాన్ ఓవర్లో అక్షర్ పటేల్(17) సిక్స్ కొట్టాడు. బౌండరీ వద్ద మిల్లర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించినా అందుకోలేకపోయాడు. దాంతో, ఢిల్లీ స్కోర్ 50 దాటింది. అమన్ ఖాన్(13), ఆడుతున్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 54/5.
గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. దాంతో, ఢిల్లీ స్కోర్ వేగం తగ్గింది. నూర్ అహ్మద్ ఓవర్లో 4 రన్స్ వచ్చాయంతే. అమన్ ఖాన్(12), అక్షర్ పటేల్(9) ఆడుతున్నారు. 9 ఓవర్లకు స్కోర్..44/5.
రషీద్ ఖాన్ ఓవర్లో అమన్ ఖాన్(11) లాంగాన్‌లో 81 మీటర్ల సిక్స్ కొట్టాడు. దాంతో, ఢిల్లీ స్కోర్ 40కి చేరింది. అక్షర్ పటేల్(7) ఆడుతున్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 40/5.
జోష్ లిటిల్ వేసిన ఆరో ఓవర్లోల అమన్ ఖాన్(4) బౌండరీ కొట్టాడు. అక్షర్ పటేల్(2) ఆడుతున్నాడు. పవర్ ప్లేలో ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.
ఢిల్లీ కష్టాల్లో పడింది. షమీ దెబ్బకు ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ప్రియం గార్గ్(10) సాహా చేతికి చిక్కాడు. దాంతో, షమీ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అమన్ ఖాన్ వచ్చాడు అక్షర్ పటేల్ ఆడుతున్నారు. 5 ఓవర్లకు స్కోర్.. 23/5.
షమీ దెబ్బకు ఢిల్లీ నాలుగో వికెట్లు కోల్పోయింది. మనీశ్ పాండే(1) సాహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు., ప్రియం గార్గ్(10), అక్షర్ పటేల్ ఆడుతున్నారు.
ఢిల్లీ మూడో వికెట్ పడింది. షమీ ఓవర్లో రిలే రస్సో(8) ఔటయ్యాడు. కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టడంతో వెనుదరిగాడు. మనీశ్ పాండే వచ్చాడు. ప్రియం గార్గ్(5) ఆడుతున్నాడు.
Shami on song 🎶🎶#DC are 3️⃣ down now!
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/ozRd2w1g9I
— IndianPremierLeague (@IPL) May 2, 2023
ఢిల్లీ రెండో వికెట్ పడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(2) రనౌటయ్యాడు. హార్దిక్ పాండ్యా ఓవర్లో ప్రియం గార్గ్ ఆడిన బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి అందుకున్న రషీద్ ఖాన్ పరుగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. దాంతో, 6 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. రిలే రస్సో వచ్చాడు.
ఢిల్లీకి షాక్.. తొలి బంతికే ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(0) ఔటయ్యాడు. షమీ వేసిన తొలి బంతిని షాట్ ఆడిన అతను మిల్లర్ క్యాచ్ పట్టడంతో డకౌటయ్యాడు. దాంతో, ఖాతా తెరవకుండానే ఢిల్లీ వికెట్ కోల్పోయింది. ప్రియం గార్గ్ వచ్చాడు. డేవిడ్ వార్నర్(0) ఆడుతున్నాడు.
WHAT. A. START 🔥🔥@MdShami11 with the wicket on the very first delivery of the match 😎
Philip Salt departs without scoring.
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #DCvGT pic.twitter.com/ZyPiLoZJQu
— IndianPremierLeague (@IPL) May 2, 2023
ఢిల్లీ సబ్స్టిట్యూట్స్ : ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, యశ్ ధూల్, ప్రవీణ్ దూబే, అభిషేక్ పొరెల్.
గుజరాత్ సబ్స్టిట్యూట్స్ : శుభ్‌మన్ గిల్, సాయి కిషోర్, శ్రీకర్ భరత్, సాయి సుదర్శన్.
Here are the Playing XIs 👌🏻👌🏻
What do you make of the two sides tonight 🤔
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #DCvGT pic.twitter.com/1dkmU2fhWj
— IndianPremierLeague (@IPL) May 2, 2023
ఢిల్లీ తుది జట్టు : డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిఫ్ సాల్ట్(వికెట్ కీపర్), మనీశ్ పాండే, రిలే రస్సో, ప్రియం గార్గ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అన్రిజ్ నార్జ్, ఇషాంత్ శర్మ.
గుజరాత్ తుది జట్టు : వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జోషువా లిటిల్.
ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఫిఫ్టీ బాదిన మిచెల్ మార్ష్ గాయం కారణంగా ఈ గేమ్ ఆడట్లేదు. అతడి స్థానంలో రిలే రస్సో వచ్చాడు. గాయం నుంచి కోలుకున్న ఖలీల్ అహ్మద్ తుది జట్టులో ఆడనున్నాడు. గుజరాత్ మాత్రం అదే జట్టును కొనసాగించనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచాడు. పిచ్ పొడిగా ఉండడంతో బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో, గుజరాత్ మొదట బౌలింగ్ చేయనుంది.