IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. హోరాహోరీగా జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(65) అర్ధ శతకంతో రాణించాడు. ఆఖర్లో కామెరూన్ గ్రీన్(7), టిమ్ డేవిడ్ (13) ధాటిగా ఆడారు. దాంతో, 20వ ఓవర్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో, వార్నర్ సేనకు వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.
2 required off the final ball!
Brace yourselves folks 🔥🔥
Follow the match ▶️ https://t.co/6PWNXA2Lk6 #TATAIPL | #DCvMI pic.twitter.com/JeLKpFVTay
— IndianPremierLeague (@IPL) April 11, 2023
ఐపీఎల్ 16వ సీజన్లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. హోరాహోరీగా జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(65) అర్ధ శతకంతో రాణించాడు. ఆఖర్లో కామెరూన్ గ్రీన్(7), టిమ్ డేవిడ్ (13) ధాటిగా ఆడారు. దాంతో, 20వ ఓవర్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో, వార్నర్ సేనకు వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.
అన్రిజ్ నార్జ్ వేసిన 18వ ఓవర్లో 6 రన్స్ వచ్చాయి. టిమ్ డేవిడ్ (3 ), కామెరూన్ గ్రీన్(7) ఆడుతున్నారు. 18 ఓవర్లకు ముంబై స్కోర్.. 153/4. ముంబై విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి.
ముంబై బిగ్ వికెట్ పడింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(65) ఔటయ్యాడు. కీపర్ అభిషేక్ పొరెల్ ఒంటిచేత్తో క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు.
ముంబై మూడో వికెట్ పడింది. ఫామ్‌లో లేని సూర్యకుమార్ యాదవ్(0) ఔటయ్యాడు. తొలి బంతికి షాట్ ఆడాడు. బౌండరీ వద్ద కుల్దీప్ క్యాచ్ పట్టడంతో సూర్య వెనుదిరిగాడు.
తిలక్ వర్మ(41) ఔటయ్యాడు. ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అతను మొదటి బంతికి ఫోర్ రెండో బంతిని మిడ్ వికెట్ దిశగా స్టాండ్స్‌లోకి పంపాడు. మూడో బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్లో సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికి బౌండరీ వద్ద మనీష్ పాండే క్యాచ్ పట్టటంతో ఔటయ్యాడు.
రోహిత్ శర్మ(60) తిలక్ వర్మ(24) రెండో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. ముంబై విజయానికి 36 బంతుల్లో 52 పరుగులు కావాలి. 14 ఓవర్లకు ముంబై స్కోర్.. 121/1
ముంబై 13 ఓవర్లకు 117 స్కోర్ చేసింది. రోహిత్ శర్మ(58) తిలక్ వర్మ(22) క్రీజులో ఉన్నారు. వీళ్లు రెండో వికెట్‌కు 46 రన్స్ చేశారు. ముంబై విజయానికి 42 బంతుల్లో 56 పరుగులు కావాలి.
Skipper @ImRo45 leading from the front and how! 💪
A fine half-century comes up for the #MI captain, who's going strong at the moment along with Tilak Varma at the other end 👌👌
Follow the match ▶️ https://t.co/6PWNXA2Lk6#TATAIPL | #DCvMI pic.twitter.com/qBI8V0fwk4
— IndianPremierLeague (@IPL) April 11, 2023
రోహిత్ శర్మ(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. కుల్దీప్ ఓవర్లో సింగిల్ తీసి యాభైకి చేరువయ్యాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో అతను అర్ధ శతకం బాదాడు.
ముంబై తొలి వికెట్ పడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(31) రనౌట్ అయ్యాడు. ముఖేశ్ కుమార్ ఇచ్చిన బంతిని అందుకున్న లలిత్ యాదవ్ వికెట్లను గిరాటేయడంతో కిషన్ వెనుదిరిగాడు. దాంతో, 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 68 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(37), ఇషాన్ కిషన్(30) దంచి కొడుతున్నారు.
Effortless!
The Rohit-Sharma pickup shot ✨🤌
FIFTY partnership up for the opening wicket 🙌#TATAIPL | #DCvMI | @ImRo45 pic.twitter.com/9QqsvmFXL4
— IndianPremierLeague (@IPL) April 11, 2023
ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(30, ఇషాన్ కిషన్(28) దంచి కొడుతున్నారు. అక్షర్ పటేల్ ఓవర్లో రోహిత్, ఇషాన్ చెరొక ఫోర్ కొట్టారు. ఐదు ఓవర్లకు ముంబై స్కోర్.. 59/0
అన్రిజ్ నార్జ్ ఓవర్లో రోహిత్ శర్మ(24) సిక్స్, ఫోర్ బాదాడు. ఇషాన్ కిషన్(18)క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లకు ముంబై స్కోర్.. 42/0
ఇషాన్ కిషన్(13)దూకుడుగా ఆడుతున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో అతను హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. దాంతో, 13రన్స్ వచ్చాయి. రోహిత్ శర్మ(14) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు ముంబై స్కోర్.. 27/0
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(14) తొలి ఓవర్లోనే రెచ్చిపోయాడు. ముఖేశ్ కుమార్ వేసిన మూడో బంతికి ఫోర్ కొట్టిన అతను నాలుగో బంతిని ఆఫ్‌సైడ్ స్టాండ్స్‌లోకి పంపాడు. ఆఖరి బంతికి ఫోర్ కొట్టాడు. దాంతో, 14 రన్స్ వచ్చాయి. ఇషాన్ కిషన్(0) క్రీజులో ఉన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(51), అక్షర్ పటేల్ (54) అర్ధ శతకాలతో రాణించారు. రిలే మెరిడిత్ ఆఖరి ఓవర్లో అన్రిజ్ నార్జ్(5) ఔటయ్యాడు. మూడో బంతికి బౌండరీ కొట్టిన అతను నాలుగో బంతికి బౌల్డ్ అయ్యాడు. దాంతో ఢిల్లీ 172 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా మూడేసి వికెట్లు తీశారు. రిలే మెరిడిత్ రెండు, హృతిక్ షోకీన్ ఒక వికెట్ తీశారు.
5⃣0⃣ partnership up between @davidwarner31 & @akshar2026
1⃣5⃣0⃣ up for @DelhiCapitals!#DC fans, what would be a match-winning total from here 🤔
Follow the match ▶️ https://t.co/6PWNXA2Lk6#TATAIPL | #DCvMI pic.twitter.com/ohbv4YBi3X
— IndianPremierLeague (@IPL) April 11, 2023
జాసన్ బెహ్రెండార్ఫ్ దెబ్బకు ఢిల్లీవరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ పొరెల్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, ఢిల్లీ తొమ్మిదో వికెట్ పడింది.
ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. వధీర బంతిని గురి చూసి కొట్టడంతో కుల్దీప్ ఔటయ్యాడు.
ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్(51) ఔటయ్యాడు. జాసన్ బెహ్రెండార్ఫ్ ఓవర్లో గ్రీన్ క్యాచ్ పట్టడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది.
హాఫ్ సెంచరీ కొట్టి జోరు మీదున్న అక్షర్ పటేల్ (54) ఔటయ్యాడు. జాసన్ బెహ్రెండార్ఫ్ ఓవర్లో అర్షద్ ఖాన్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టడంతో అక్షర్ వెనుదిరిగాడు.
అక్షర్ పటేల్ (54) హాఫ్ సెంచరీ కొట్టాడు. రిలే మెరిడిత్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఇది అతనికి తొలి హాఫ్ సెంచరీ. దాంతో, ఢిల్లీ స్కోర్ 160 దాటింది. డేవిడ్ వార్నర్(51) క్రీజులో ఉన్నాడు. 18 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 165/5
FIFTY off just 2⃣2⃣ deliveries!@akshar2026 brings up his half-century in style with a MAXIMUM straight down the ground 😎
Follow the match ▶️ https://t.co/6PWNXA2Lk6#TATAIPL | #DCvMI pic.twitter.com/tuwHsAgVee
— IndianPremierLeague (@IPL) April 11, 2023
అక్షర్ పటేల్ (42) సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. జాసన్ బెహ్రెండార్ఫ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో, ఆరో వికెట్‌కు అతను వార్నర్‌తో కలిసి 50 రన్స్ జోడించారు. డేవిడ్ వార్నర్(51) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లకు స్కోర్.. 151/5
ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఆరు ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్-2023 సీజన్లో వార్నర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 16 ఓవర్లలో 136/5.
ఓ వైపు వికెట్లు పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు స్కోర్ బోర్డును పరుగులెత్తిస్తున్నారు. 15 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (48), అక్షర్ పటేల్ (18) క్రీజులో ఉన్నారు.
ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో వికెట్‌ను కోల్పోయింది. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 12.3 ఓవర్లలో ఢిల్లీ 98 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (42) క్రీజులో ఉన్నాడు.
పీయూష్ చావ్లా మళ్లీ ఢిల్లీని దెబ్బకొట్టాడు. విధ్వంసక ఆటగాడురోవ్మన్ పావెల్(4)ను ఎల్బీగా ఔట్ చేశాడు. పావెల్ రివ్యూ తీసుకున్నా కూడా ఫలితం లేకపోయింది. దాంతో, 86 రన్స్ వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ పడింది. లలిత్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.
ఢిల్లీ మూడో వికెట్ పడింది. యశ్ ధూల్(2) ఔటయ్యాడు. రిలే మెరిడిత్ బౌలింగ్‌లో నేహల్ వదీర బౌండరీ వద్ద క్యాచ్ పట్టడంతో అతను నిరాశగా వెనుదిరిగాడు. రోవ్‌మన్ పావెల్(4) ఆఖరి బంతికి ఫోర్ బాదాడు. డేవిడ్ వార్నర్(31) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.
పీయూష్ చావ్లా బిగ్ వికెట్ తీశాడు. మనీశ్ పాండే(26)ను ఔట్ చేశాడు. 8వ ఓవర్లో మూడో బంతికి మనీశ్ మిడాన్‌లో భారీ షాట్ ఆడాడు. బౌండరీ వద్ద జాసన్ బెహ్రెండార్ఫ్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. డేవిడ్ వార్నర్(27), యశ్ ధూల్ క్రీజులో ఉన్నారు.
మనీశ్ పాండే(26), డేవిడ్ వార్నర్(27) దంచుతున్నారు. వార్నర్ హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో మనీశ్ బౌండరీ కొట్టారు. వైడ్ రూపంలో మరో ఐదు రన్స్ వచ్చాయి. 8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 73/1. వీళ్లు రెండో వికెట్‌కు 42 రన్స్ జోడించారు.
Both @davidwarner31 & @im_manishpandey are playing with a positive intent 👌
After 8 overs, @DelhiCapitals reach 75/1 at the end of eight overs ✅
Follow the match ▶️ https://t.co/6PWNXA2Lk6 #TATAIPL | #DCvMI pic.twitter.com/XhxvLLdDki
— IndianPremierLeague (@IPL) April 11, 2023
పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 51 రన్స్ చేసింది. హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో మనీశ్ పాండే(17) చెలరేగాడు, ఆఖరి రెండు బంతుల్ని బౌండరీ దాటించాడు. డేవిడ్ వార్నర్(18) క్రీజులో ఉన్నాడు.
రిలే మెరిడిత్ బౌలింగ్‌లో మనీశ్ పాండే(9) రెండు బౌండరీలు కొట్టాడు. డేవిడ్ వార్నర్(17) క్రీజులో ఉన్నాడు. ఐదు ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 42/1
ఢిల్లీ తొలి వికెట్ పడింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ పృథ్వీ షా(15) ఔటయ్యాడు. హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో గ్రీన్ కవర్స్‌లో క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. డేవిడ్ వార్నర్(17), మనీశ్ పాండే క్రీజులో ఉన్నారు.
Hrithik Shokeen with the first breakthrough of the night 😎#DC lose Prithvi Shaw for 15 as they reach 34/1 after 4 overs.
Follow the match ▶️ https://t.co/6PWNXA2Lk6#TATAIPL | #DCvMI pic.twitter.com/a4gvLGOB37
— IndianPremierLeague (@IPL) April 11, 2023
కామెరూన్ గ్రీన్ వేసిన మూడో ఓవర్లో డేవిడ్ వార్నర్(17)రెండు ఫోర్ బాదాడు. దాంతో, 10 రన్స్ వచ్చాయి. పృథ్వీ షా(11) క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 29/0
అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో మొదటి బంతికి డేవిడ్ వార్నర్(8) ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి పృథ్వీ షా(10) కవర్స్‌లో బౌండరీ కొట్టాడు. దాంతో, 7 రన్స్ వచ్చాయి. క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 19/0
జాసన్ బెహ్రెండార్ఫ్ మొదటి ఓవర్ రెండో బంతికి పృథ్వీ షా(5) బౌండరీ కొట్టాడు. దాంతో, 7 రన్స్ వచ్చాయి. డేవిడ్ వార్నర్(2) క్రీజులో ఉన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ సబ్స్టిట్యూట్స్ : అమన్ ఖాన్, ముఖేశ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రవీణ్ దూబే, ఇషాంత్ శర్మ.
ముంబై ఇండియన్స్ సబ్స్టిట్యూట్స్ : త్సిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రమన్‌దీప్ సింగ్.
ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయపడిన ఖలీల్ అహ్మద్ స్థానంలో యశ్ ధూల్ వచ్చాడు. ఈ మ్యాచ్‌తో ఈ యంగ్‌స్టర్ ఐపీఎల్లో ఆరంగేట్రం చేయనున్నాడు. మూడు మ్యాచుల్లో విఫలమైన రిలే రస్సో ప్లేస్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తీసుకున్నారు. ముంబై జట్టు స్టబ్స్ ప్లేస్‌లో రిలే మెరిడిత్‌ను తీసుకుంది. జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేడు.
A moment for Yash Dhull to savour 👌
He makes his IPL debut tonight 👏🏻👏🏻
Go well 👍👍#TATAIPL | #DCvMI | @DelhiCapitals pic.twitter.com/LkUchSK22y
— IndianPremierLeague (@IPL) April 11, 2023
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.