IPL 2023 : సొంత గ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు దంచారు. ఓపెనర్ జోస్ బట్లర్(95) విధ్వంసక బ్యాటింగ్, సంజూ శాంసన్(66 నాటౌట్) మెరుపులతో భారీ స్కోర్ చేసింది. హైదరాబాద్ ముందు 215 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సీజన్లో సెంచరీ కొట్టిన యశస్వీ జైస్వాల్(35) త్వరగానే ఔటయ్యాడు దాంతో, 54 వద్ద రాజస్థాన్ వికెట్ పడింది. ఆ తర్వాత బట్లర్, శాంసన్ జోరు కొనసాగించారు. రెండో వికెట్‌కు 138 రన్స్ జోడించారు.
నటరాజన్ వేసిన 20వ ఓవర్లో సంజూ శాంసన్(66 నాటౌట్) థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ కొట్టాడు. దాంతో, రాజస్థాన్ స్కోర్ రెండొందలు దాటింది. ఐదో బంతికి లాంగాన్‌లో సిక్స్, ఆఖరి బాల్‌కు బౌండరీ బాదాడు. దాంతో, రాజస్థాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. హెట్మెయిర్ (7) నాటౌట్‌గా నిలిచాడు.
Jos the Boss 😎
For his magnificent innings of 95, Jos Buttler is our Top Performer from the first innings.
A look at his batting summary here 👇👇#TATAIPL #RRvSRH pic.twitter.com/f8CvXNfcfy
— IndianPremierLeague (@IPL) May 7, 2023