IPL 2023 : క్రికెట్ అభిమానులకు వేసవిలో వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. పవర్ హిట్టర్ల బ్యాటింగ్ విన్యాసాలు, బంతితో చెలరేగే స్టార్ బౌలర్ల ప్రదర్శనకు వేదికైన ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు ఫ్యాన్స్‌కు అసలైన క్రికెట్ మజాను అందివ్వనుంది. మే 28న అహ్మదాబాద్‌లో టైటిల్ పోరు జరగనుంది. 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
హార్దిక్ పాండ్యా, ధోనీ సారథ్యంలోని ఈ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అభిమానులను అలరించనున్నాయి. గత సీజన్లో గుజరాత్ టైటన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాండ్యా కెప్టెన్సీలోని ఆ జట్టు ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది.
శుక్రవారం (మార్చి 31) లీగ్ ప్రారంభం కానుండగా.. ఆ వెంటనే వరుసగా రెండు రోజుల పాటు డబుల్ హెడర్స్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. ఇక ఈ సీజన్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమల్లోకి రానుండటంతో ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగనుంది. అంటే బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ ఒక జట్టు అదనపు ప్లేయర్‌ను ఆడించే అవకాశం ఉంది. ఉదాహరణకు ముందు బ్యాటింగ్ చేసిన జట్టు ఒక బ్యాటర్ స్థానంలో మంచి బౌలర్‌కు తుది జట్టులో చోటు కల్పించే చాన్స్ ఉంది.
ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్న 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉన్నాయి. గ్రూప్ – ఏ… ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్.
గ్రూప్ – బిలో.. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్.
గత మూడు సీజన్లుగా పరిమిత వేదికల్లోనే నిర్వహించిన ఐపీఎల్‌ను ఈ సారి ఇంటా, బయటా పద్దతిలో జరుపనున్నారు. కొవిడ్-19 ప్రభావం తగ్గిపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఈ లెక్కన ప్రతి జట్టు తమ సొంతగడ్డపై ఏడేసి మ్యాచ్‌లు.. ఇతర వేదికల్లో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈసారి 10 జట్లు 70 లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి. ఈ మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా 12 స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, లక్నో, మొహాలీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గువహటి, ధర్మశాలలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
గత కొన్నాళ్లుగా క్రికెట్ పండుగను ఆస్వాదించలేకపోయిన హైదరాబాద్ అభిమానులు ఈ సారి పండుగ చేసుకోనున్నారు. పదహారో సీజన్ ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఏప్రిల్ 9న (సన్‌రైజర్స్ హైదరాదాబ్ – పంజాబ్ కింగ్స్), ఏప్రిల్ 18న (సన్‌రైజర్స్ హైదరాదాబ్ – ముంబై ఇండియన్స్), ఏప్రిల్ 24న (సన్‌రైజర్స్ హైదరాదాబ్- ఢిల్లీ క్యాపిటల్స్) మ్యాచ్‌లు జరుగుతాయి.
మే 4న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్
మే 13న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
మే 18న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
* మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 (16వ సీజన్) ప్రారంభం.
* తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఢీ.
* 12 వేదికల్లో మ్యాచ్‌లు.
* లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు.
* 52 రోజుల పాటు జరుగనున్న సీజన్.
* ఏప్రిల్ 1న తొలి డబుల్ హెడర్.
* సీజన్లో మొత్తం 18 డబుల్ హెడర్స్.