ఐపీఎల్ రిటైన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్లను తమతో అట్టిపెట్టుకుంటాయన్న దానిపై నెలకొన్న ఆసక్తికి తెరపడింది. పాత కాపులకే పెద్దపీట వేస్తూ ఫ్రాంచైజీలు మెగా ఐపీఎల్ వేలానికి సిద్ధమయ్యాయి. అటు ఐపీఎల్‌తో పాటు జాతీయ జట్టులో నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్‌కు బంపర్ ఆఫర్ దక్కింది. ఏకంగా రూ.7 కోట్లతో బెంగళూరు తిరిగి సిరాజ్‌ను తీసుకుంది. రానున్న సీజన్లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌తో కలిసి సిరాజ్.. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగనున్నాడు.
న్యూఢిల్లీ: ఐపీఎల్ రిటెన్షన్(నిలుపుకొను) తంతు ఆసక్తికరంగా సాగింది. రానున్న సీజన్లో మరో రెండు కొత్త జట్ల చేరికతో జరుగనున్న మెగా వేలంపై దృష్టి పెట్టిన ఫ్రాంచైజీలు అందుకు తగ్గట్లు కావాల్సిన ఆటగాళ్లను తమ వద్ద అట్టిపెట్టుకున్నాయి. ఈ ప్రక్రియకు ఆఖరి రోజైన మంగళవారం ఎనిమిది ఫ్రాంచైజీలు తమ ప్రతినిధుల ద్వారా ప్లేయర్ల పేర్లను ప్రకటించాయి. తొలుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో మొదలై..ఆ తర్వాత ముంబై, పంజాబ్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, రాజస్థాన్ జట్లు తాము ఎంచుకున్న ఆటగాళ్లతో పాటు వదులుకున్న వాళ్ల వివరాలను వెల్లడించారు. లీగ్‌లో పర్స్‌మనీ(రూ.90 కోట్లు)గా నిర్ణయించగా, ప్లేయర్లను తీసుకున్న తర్వాత అందరికంటే ఎక్కువగా పంజాబ్ దగ్గర రూ.72 కోట్లు మిగిలుండగా, ఢిల్లీ రూ.47.5 కోట్లతో ఆఖరి స్థానంలో ఉంది.2018లో తొలిసారి ఆర్సీబీ..సిరాజ్‌ను రూ.2.6 కోట్లకు దక్కించుకోగా తాజాగా రూ.7 కోట్లకు తిరిగి తీసుకుంది.తనదైన స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో సఫలమవుతున్న సిరాజ్ ప్రదర్శనకు ఆర్సీబీ యాజమాన్యం తగిన గుర్తింపునిచ్చిందని చెప్పాలి.
శాంసన్ 14 కోట్లు
బట్లర్ 10 కోట్లు
జైస్వాల్ 4 కోట్లు
మిగిలిన మొత్తం: 62 కోట్లు
రోహిత్‌శర్మ 16 కోట్లు
జస్ప్రీత్ బుమ్రా 12 కోట్లు
సూర్యకుమార్ 8 కోట్లు
పొలార్డ్ 6 కోట్లు
మిగిలిన మొత్తం: 48 కోట్లు
విరాట్ కోహ్లీ 15 కోట్లు
మ్యాక్స్‌వెల్ 11 కోట్లు
మహ్మద్ సిరాజ్ 7 కోట్లు
మిగిలిన మొత్తం: 57 కోట్లు
రిషబ్ పంత్ 16 కోట్లు
అక్షర్‌పటేల్ 9 కోట్లు
పృథ్వీషా 7.5 కోట్లు
నోర్జె 6.5 కోట్లు
మిగిలిన మొత్తం: 47.5 కోట్లు
రవీంద్ర జడేజా 16 కోట్లు
మహేంద్ర సింగ్ ధోనీ 12 కోట్లు
మోయిన్ అలీ 8 కోట్లు
రుతురాజ్ గైక్వాడ్ 6 కోట్లు
మిగిలిన మొత్తం: 48 కోట్లు
రస్సెల్ 12 కోట్లు
వరుణ్ చక్రవర్తి 8 కోట్లు
వెంకటేశ్ అయ్యర్ 8 కోట్లు
నరైన్ 6 కోట్లు
మిగిలిన మొత్తం: 48 కోట్లు
మయాంక్ 12 కోట్లు
అర్ష్‌దీప్‌సింగ్ 4 కోట్లు
మిగిలిన మొత్తం: 72 కోట్లు
విలియమ్సన్ 14 కోట్లు
సమద్ 4 కోట్లు
ఉమ్రాన్ 4 కోట్లు
మిగిలిన మొత్తం68 కోట్లు