క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. ఈ పండుగ ముగింపు వేడుకల సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ తన డ్యాన్స్‌తో అందరినీ అలరించనున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ నుంచి ‘‘నాటు.. నాటు’’ సాంగ్‌కు డ్యాన్స్ చేయబోతున్నాడు. దీనికోసం రణ్వీర్ చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
దీనికి సంబంధించిన వీడియోలను రణ్వీర్ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా హాజరవుతున్నట్లు సమాచారం. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్.. రెండో క్వాలిఫైయర్‌లో బెంగళూరును ఓడించి ఫైనల్ చేరింది. తొలి క్వాలిఫైయర్‌లో ఓటమికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని, అలాగే రాజస్థాన్‌కు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించిన మాజీ క్రికెటర్ షేర్ వార్న్‌కు ఘనమైన నివాళి అందివ్వాలని ఆ జట్టు ప్రయత్నిస్తోంది.