IPL 2022 | టీ20 అంటేనే బ్యాటర్లకు జాతర. బంతి ఏమాత్రం బ్యాట్ కు అనుకూలంగా వచ్చినా అది స్టాండ్స్ లో పడాల్సిందే. ఇక ఐపీఎల్ వంటి లీగ్ లో సిక్సర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?
మహారాష్ట్ర వేదికగా రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లీగ్ లు ముగిసి ఇక ప్లేఆఫ్స్ కు ముహుర్తం కుదిరింది. కాగా ఈ సీజన్ లో ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని ఓ అరుదైన ఘనత చోటు చేసుకుంది.
ఐపీఎల్-15 లో తొలిసారి వెయ్యి సిక్సర్లు నమోదయ్యాయి. హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్ లో పీబీకేఎస్ బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ సిక్సర్ బాదడంతో ఈ సీజన్ లో వెయ్యి సిక్సర్లు నమోదయ్యాయి. సింగిల్ ఐపీఎల్ సీజన్ లో వెయ్యి సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి. గతంలో 2018 లో అత్యధికంగా 872 సిక్సర్లు నమోదయ్యాయి. ఆ రికార్డును ఐపీఎల్-15 బ్రేక్ చేసింది.
ఈ సీజన్ లో తొలి సిక్సర్ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప. ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా రాబిన్ ఊతప్ప తొలి సిక్సర్ బాదాడు. ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి ఊతప్ప సిక్సర్ కొట్టాడు. ఇక తాజాగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లో షెపర్డ్ వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతికి సిక్సర్ కొట్టడం ద్వారా వెయ్యి సిక్సర్లు నమోదయ్యాయి. వెయ్యో సిక్సర్ కొట్టింది పంజాబ్ స్టార్ బ్యాటర్ లివింగ్ స్టోన్.
2022 – 1001
2018 – 878
2019 – 784
2020 – 734
2012 – 731
2009 లో 506 (అత్యల్పం)
– 116 : రాజస్తాన్ రాయల్స్
– 113 : కోల్‌కతా నైట్ రైడర్స్
– 110 : పంజాబ్ కింగ్స్
– 106 : ఢిల్లీ క్యాపిటల్స్
– 103 : చెన్నై సూపర్ కింగ్స్
– 101 : లక్నో సూపర్ జెయింట్స్
– 100 : ముంబై ఇండియన్స్
– 97 : సన్ రైజర్స్ హైదరాబాద్
– 86 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
– 69 : గుజరాత్ టైటాన్స్