IPL 2021 | ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిన దినేశ్ కార్తీక్
IPL 2021 | కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ సారధి, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌ను బీసీసీఐ మందలించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో అతను

షార్జా: కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ సారధి, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌ను బీసీసీఐ మందలించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో అతను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే అతను ఏ నిబంధనను ఉల్లంఘించిందీ మాత్రం బయటపెట్టలేదు.
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని 2.2 సెక్షన్‌లోని లెవెల్ 1 తప్పిదం చేసినట్లు కార్తీక్ కూడా అంగీకరించినట్లు బీసీసీఐ తెలిపింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన రెండో క్వాలిఫైయర్‌లో దినేశ్ కార్తీక్ ఒక్క పరుగూ చేయకుండానే వెనుతిరిగాడు. అయితే ఆ సమయంలోనే కోపంతో ఒక వికెట్‌ను చేత్తో కొట్టి పడేసినట్లు కనిపిస్తోంది. ఈ కారణంగానే అతన్ని బీసీసీఐ మందలించినట్లు కొందరు భావిస్తున్నారు.
కాగా, ఏడేళ్ల తర్వాత మళ్లీ కోల్‌కతా జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరింది. రెండో క్వాలిఫైయర్‌లో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందివ్వడంతో కోల్‌కతా జట్టు సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వరకూ మ్యాచ్ సాగింది.
ఢిల్లీ బౌలర్లు చివరి ఓవర్లలో విజృంభించడంతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ స్కోరు చేయలేకపోయారు. దానికితోడు వికెట్లు కూడా టపటపా పడిపోయాయి. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠి తన జట్టును ఐపీఎల్ ఫైనల్స్ చేర్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

