బంజారాహిల్స్: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ట్రయాథ్లాన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఇంటర్నేషనల్ ట్రయాథ్లాన్ క్రీడాకారుడు మన్మధ్ రెబ్బా తెలిపాడు. అమెరికాలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘అల్రామన్ వరల్డ్ చాంపియన్షిప్స్ హవాయ్ ట్రయాథ్లాన్’ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్న ఏకైక తెలుగు అథ్లెట్ మన్మధ్ రెబ్బా సోమవారం జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.
అంతర్జాతీయంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ట్రయాథ్లాన్ పోటీల్లో మూడుసార్లు పాల్గొనడమే కాకుండా.. అత్యంత క్లిష్టమైన ఈ పోటీని 39 గంటల్లో పూర్తిచేశానని వివరించాడు. ఇలాంటి సాహసోపేతమైన క్రీడలో భారతీయులకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో త్వరలోనే హైదరాబాద్లో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.