న్యూఢిల్లీ : జులై 12-16 తేదీలలో బ్మాంకాక్లో జరిగే ఏషియన్ అథ్లెటిక్స్ జట్టులో పాల్గొనే 54మంది సభ్యుల బృం దాన్ని గురువారం ప్రకటించారు. అందులో 26మంది మహిళలు ఉన్నారు. తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి 200మీ., 100మీ. హర్డిల్స్ విభాగాల్లో పోటీపడనున్నది. ఈ సీజన్లో జరిగిన వివిధ పోటీలలో అథ్లెట్ల చూపిన ప్రతిభ ఆధారంగా ఈ బృం దాన్ని ఎంపిక చేశారు.
దేశంలోని మేటి క్రీడాకారులంతా బృం దంలో చోటు దక్కించుకున్నారు. కాగా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత అవినాశ్ శాబెల్(3000మీ. స్టీపుల్‌చేజ్) ఈ పోటీలలో పాల్గొనడం లేదు.