బెంగళూరు: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకుని టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా..చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. మంగళవారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా..చాంపియన్స్ టోర్నీ కోసం 15 మందితో ప్రకటించిన జట్టులో బుమ్రా చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న ఈ పేసర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తప్పిస్తూ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టుకు ఎంపిక చేశారు. బుమ్రాకు బదులు హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేస్తారనుకున్నా..సెలెక్టర్ల నుంచి అతనికి నిరాశే ఎదురైంది. జైస్వాల్, దూబే జతగా సిరాజ్.. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు.
జట్టు వివరాలు:
రోహిత్‌శర్మ(కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), కోహ్లీ, శ్రేయాస్, కేఎల్ రాహుల్(కీపర్), పంత్(కీపర్), హార్దిక్, అక్షర్, సుందర్, కుల్దీప్, రాణా, షమీ, అర్ష్‌దీప్‌సింగ్, జడేజా, చక్రవర్తి