హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్ రేసింగ్‌కు చిరునామాగా మారబోతున్నది. ఇప్పటికే ఫార్ములా-ఈ చాంపియన్‌షిప్‌తో రేసింగ్‌ను ఆస్వాదించిన దేశ అభిమానులు.. త్వరలో మోటార్రేసింగ్తో కొత్త అనుభూతి పొందనున్నారు. ఈ ఏడాది నుంచి అంతర్జాతీయ మోటార్‌సైకిల్ సమాఖ్య(ఎఫ్ఐఎం) ఈ-ఎక్స్ప్లోరర్లో భారత్ నుంచి ఇండీ రేసింగ్ టీమ్ తొలిసారి బరిలోకి దిగుతున్నది.
హైదరాబాద్‌కు చెందిన కంకణాల స్పోర్ట్స్ గ్రూపు (కేఎస్‌జీ) ఇండీ రేసింగ్ టీమ్‌ను సొంతం చేసుకుంది. రానున్న తొమ్మిదేండ్ల కాలానికి ఎఫ్ఐఎంతో ఒప్పం దం కుదుర్చుకున్నట్లు కేఎస్‌జీ గ్రూపు వ్యవస్థాపకులు కంకణాల అభిషేక్‌రెడ్డి గురువారం మీడియా భేటీలో పేర్కొన్నారు. ఇండీ రేసింగ్ డ్రైవర్లు ఐశ్వర్య, శాండ్రా గోమెజ్‌తో కలిసి అభిషేక్ మాట్లాడారు. ఈ ఏడాది నవంబర్‌లో హైదరాబాద్‌లో రేసింగ్ సీజన్ ఫైనల్ జరుగనుందని పేర్కొన్నారు.