INDvsAUS T20I: మూడో టీ20లో టాస్ గెలిచిన ఆసీస్.. ఓడితే సిరీస్ గోవిందా..!
INDvsAUS T20I: హ్యాట్రిక్ గెలుపుతో పాటు టీ20 సిరీస్ను సొంతం చేసుకునేందుకు యువ భారత్కు సువర్ణావకాశం. టాస్ నెగ్గిన ఆసీస్ సారథి మాథ్యూ వేడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
INDvsAUS T20I: ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను వరుసగా రెండు మ్యాచ్లలో ఖంగుతినిపించి హ్యాట్రిక్ గెలుపుతో పాటు టీ20 సిరీస్ను సొంతం చేసుకునేందుకు యువ భారత్కు సువర్ణావకాశం. విజయవాడ, తిరువనంతపురంలో మ్యాచ్లను గెలుచుకున్న భారత్.. నేడు గువహతి (అసోం) లోని బర్సపర వేదికగా జరుగుతున్న మూడో టీ20లో కూడా గెలిచి సిరీస్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా టాస్ ఓడగా.. టాస్ నెగ్గిన ఆసీస్ సారథి మాథ్యూ వేడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ బ్యాటింగ్ చేయనుంది.
వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంతో టీ20 సిరీస్లోకి బరిలోకి దిగిన కంగారూలు.. నేటి మ్యాచ్లో గెలిచి సిరీస్ను కాపాడుకునే పనిలో ఉన్నారు. మరి బర్సపరలో గెలుపు ఎవరిని వరించేనో…! గత రెండు మ్యాచ్లలో కొనసాగించిన జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. ముఖేశ్ కుమార్కు బదులు అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. కీలకమైన ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో ఆసీస్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో ఓడితే ఆసీస్ సిరీస్ కోల్పోనుంది. బర్సపర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.
తుది జట్లుః
భారత్ః రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ
ఆస్ట్రేలియాః ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జేసన్ బెరెన్డార్ఫ్, తన్వీన్ సంఘా, కేన్ రిచర్డ్సన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

