జకర్తా : ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. పీవీ సింధు, కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ వంటి స్టార్ షట్లర్లు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్‌లో సింధు 20-22, 12-21తో తుయ్ లిన్హ్ (వియత్నాం) చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్‌లో రజావత్ 14-21తో నరోక (జపాన్) చేతిలో ఓడగా జియోన్ జిన్ (దక్షిణ కొరియా) 21-12, 21-10తో కిరణ్‌ను ఇంటికి పంపించాడు. లక్ష్యసేన్.. 21-9, 21-14తో ఒబయాషి (జపాన్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధృవ్ కపిల.. 21-18, 21-14తో అద్నాన్ మౌలానా-సారి జమిల్ (మలేషియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు.