Lakshya sen | బర్మింగ్‌హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. బుధవారం పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో లక్ష్యసేన్ 21-14, 21-14తో మాగ్నస్ జోహానన్(డెన్మార్క్)పై అలవోక విజయం సాధించాడు. 40నిమిషాల్లో ముగిసిన పోరులో లక్ష్యసేన్ తనదైన ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆది నుంచి దూకుడు కనబరిచిన లక్ష్యసేన్..వరుస గేముల్లో ప్రత్యర్థిని మట్టికరిపించాడు.