దుబాయ్: భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయాడు. ప్రపంచకప్ సందర్భంగా టాప్ ర్యాంక్‌కు చేరిన గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో 810 పాయింట్లతో రెండో స్థానానికి చేరగా.. పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (824 పాయింట్లు) తిరిగి టాప్కు చేరాడు. కోహ్లీ (775) మూడో ప్లేస్‌లో, రోహిత్ (754) నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలోమహరాజ్ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నుంచి సిరాజ్ (3), బుమ్రా (5) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.