ముంబై: భారత వెటరన్ ఆటగాడు కేదార్ జాదవ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 39 ఏండ్ల జాదవ్ ఈ మేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘కెరీర్ ఆసాంతం నాకు మద్దతు పలికినవారందరికీ ధన్యవాదాలు’ అని ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చాడు.
2014లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన జాదవ్.. 2020లో భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఆరేండ్ల అంతర్జాతీయ కెరీర్లో 73 వన్డేలు ఆడి 52 ఇన్నింగ్స్లో 1,389 పరుగులు చేసి 27 వికెట్లు పడగొట్టిన అతడు.. 9 టీ20లలో 122 పరుగులు చేశాడు.