న్యూఢిల్లీ: భారత టాప్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన ఎఫ్ఐజీ వరల్డ్ చాలెంజ్ కప్ మహిళల వాల్ట్ విభాగంలో రజత పతకం సాధించింది. ఒడిశాకు చెందిన 31 ఏండ్ల్ల ప్రణతి శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో తన రెండు వాల్ట్ ప్రయత్నాలలో వరుసగా 12.950, 12.700 స్కోర్లు నమోదు చేసి, మొత్తంగా 13.025 సగటు స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది వియత్నాంకు చెందిన తి క్విన్ ఎన్గుయెన్ 13.375 స్కోరుతో స్వర్ణం కైవసం చేసుకోగా, ఉజ్బెకిస్తాన్ జిమ్నాస్ట్షాఖినాబోను యుసుఫోవా 12.950 స్కోరుతో కాంస్యం దక్కించుకుంది.