Australian Open 2024: మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్‌కు సువర్ణావకాశం. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జరుగుతున్న క్వాలిఫయర్స్ రౌండ్లో భాగంగా నగాల్.. గురువారం ముగిసిన రెండో రౌండ్లో 6-3, 6-2 తేడాతో ఆస్ట్రేలియాకే చెందిన ఎడ్వర్డ్ వింటర్పై గెలుపొందాడు. కెఐఎ ఎరీనా వేదికగా జరిగిన మ్యాచ్‌లో నగాల్.. గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో రెండు సెట్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు.
139వ ర్యాంకులో ఉన్న నగాల్.. మూడో రౌండ్లో స్లోవేకియాకు చెందిన అలెక్స్ మోల్కన్ తో ఢీకొనబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో గనక నగాల్ గెలిస్తే అతడు ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ రౌండ్‌కు అర్హత సాధిస్తాడు. నగాల్ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన జెఫ్రీ బ్లాన్కనెక్స్పై గెలుపొందాడు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెయిన్ రౌండ్‌కు క్వాలిఫై కాలేకపోయిన నగాల్.. ఒకవేళ రేపటి మ్యాచ్ గనక గెలిస్తే రెండోసారి ఈ టోర్నీలో పాల్గొననున్నాడు. నగాల్.. 2019, 2020లలో యూఎస్ ఓపెన్ ఆడాడు. 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఈనెల 14 (ఆదివారం) నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల, మహిళల తొలి రౌండ్ పోటీలు మొదలుకానున్నాయి.
Sumit Nagal moves into the Australian Open Qualifying Final Round . 🔥
Sumit Nagal defeated Edward Winter 🇦🇺 by 6 – 3 , 6 – 2 in Qualifying Round 2 .#AO2024 | #AustralianOpen pic.twitter.com/1hPmGRROef
— Team Bharat 🇮🇳 🥇 (@YTStatslive) January 11, 2024