చెంగ్డు: ప్రతిష్ఠాత్మక ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ యర్రాజీ జ్యోతి కాంస్య వెలుగులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగిన జ్యోతి..టోర్నీలో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. రేసును జ్యోతి 12.78సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో ఇంతకుముందు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (12.82సె)ను ఈ ఆంధ్ర అథ్లెట్ తిరుగరాసింది. విక్టోరియా ఫ్రోస్టర్(12.72సె), యానీ వు(12.76సె) వరుసగా స్వర్ణ, రజత కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పురుషుల 200మీటర్ల రేసును అమ్లాన్ బొర్గోహై 20.55 సెకన్ల టైమింగ్‌తో కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు.