IND vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు రోహిత్ సేన కుప్పకూలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మరోసారి బాల్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదువికెట్ల కూల్చి టీమిండియాను హడలెత్తించాడు. ప్రస్తుతం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా ముందు కేవలం 18 పరుగులు విజయ లక్ష్యం నిర్దేశించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. మూడోరోజు ఆట మొదలయ్యే సరికి.. భారత జట్టు ఇంకా ఆస్ట్రేలియా కంటే 29 పరుగులు వెనుకబడి ఉంది. ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 28 పరుగులతో, నితీష్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా తరఫున పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్‌కి ఒక వికెట్ దక్కింది. మూడోరోజు ఆట మొదలవగా.. తొలి ఓవర్లోనే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్ చివరి బంతికి స్లిప్‌లో రిషబ్ పంత్కి అవుటయ్యాడు. 148 పరుగుల వద్ద వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ అవుట్ అయ్యాడు. అశ్విన్ ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. భారత్ స్కోరు 153 వద్ద హర్షిత్ రాణా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. 166 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నితీశ్ రెడ్డి అవుట్ అయ్యాడు. ఆరు ఫోర్లు, సిక్సర్ సహాయంతో 42 పరుగులు చేశాడు. 175 పరుగుల వద్ద సిరాజ్ అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రం రెండో టెస్టులో కష్టాల్లో కూరుకుపోయింది. అటు బ్యాట్‌తోనూ.. బాల్‌తో టీమిండియా ఆటగాళ్లు డే-నైట్ టెస్ట్‌లో రాణించలేకపోయారు.