జకార్తా: ఇండోనేషియా ఓపెన్ సూపర్ టోర్నీలో తొలి రోజే భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా స్టార్ షట్లర్ పీవీ సింధుకు అనుకోని షాక్ ఎదురైంది. గెలిచి టోర్నీలో ముందంజ వేద్దామనుకున్న సింధు 14-21, 18-21 తేడాతో బింగ్ జియావో(చైనా) చేతిలో ఓడి నిష్క్రమించింది. 47 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తెలుగు షట్లర్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి పోరులో సాయి ప్రణీత్ 16-21, 19-21తో హన్స్ క్రిస్టియన్(డెన్మార్క్) చేతిలో ఓడి వైదొలిగాడు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి, అశ్విని పొనప్ప 21-15, 21-8తో శ్రీవిద్య, ఇషికా జైస్వాల్‌పై గెలిచి ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 21-19, 21-15తో థామస్ రుక్సెల్పై గెలువగా, ఇషా భట్నాగర్, తనీషా క్యాస్ట్రో ద్వయం, మను అత్రి, సుమిత్‌రెడ్డి జోడీ ఓటములు ఎదుర్కొన్నాయి.