చెన్నై : భారత తొలి టెస్టు విజయంలో సభ్యుడు, నాటి జట్టులో గురువారం నాటికి సజీవంగా ఉన్న మాజీ క్రికెటర్ సీడీ గోపీనాథ్ (96) గురువారం చెన్నైలో కన్నుమూశారు. 1930లో నాటి మద్రాస్ (చెన్నై)లో పుట్టిన గోపీనాథ్.. 21 ఏండ్లకే అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించారు. తొలి టెస్టు విజయం కోసం 25 టెస్టులు వేచిచూసిన భారత జట్టు.. 1952 ఫిబ్రవరిలో విజయ్ హజారే సారథ్యంలో చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని ఆఖరి టెస్టును గెలిచింది.
ఆ జట్టులో గోపీనాథ్ (మ్యాచ్‌లో 35 రన్స్ చేశారు) సభ్యుడు. గోపీనాథ్ మరణంతో భారత క్రికెట్లో ఒక శకం ముగిసినైట్టెంది. భారత్ తరఫున ఆయన 8 టెస్టులు ఆడారు.