ఢిల్లీ: ఆసియా బీచ్ గేమ్స్-2026లో భారత్ పతకాల బోణీ కొట్టింది. చైనాలోని సన్యా వేదికగా జరుగుతున్న ఆరో ఆసియా బీచ్ క్రీడల్లో భాగంగా ఫైనల్లో భారత్.. 47-31తో స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. గత ఎడిషన్‌లోనూ భారత్ పసిడి గెలిచింది. తొలి అర్ధభాగంలోనే 20-18తో ఆధిక్యంలో ఉన్న భారత అమ్మాయిలు.. సెకండాఫ్‌లో విజృంభించి 47-31తో ఈ టోర్నీలో ఆరో పతకాన్ని సాధించారు. పురుషుల ఫైనల్లో 31-44తో ఇరాన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.