న్యూఢిల్లీ : సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అండర్-18 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత పతక జోరు కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన గురువారం భారత ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి. బాలికల అండర్-18 డిస్కస్‌త్రో ఈవెంట్లో లక్షిత మహ్లావత్ 41.30మీటర్ల దూరం విసిరి కాంస్యం సొంతం చేసుకుంది. బాలికల 100మీటర్ల హర్డిల్స్‌లో శౌర్య అంబురె 13.80సెకన్ల టైమింగ్‌తో కాంస్యం కైవసం చేసుకుంది.