IPBL | హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత బాక్సింగ్ అభిమానులకు శుభవార్త! ప్రముఖ బాక్సింగ్ లీగ్‌గా పేరొందిన అంథోనీ పెట్టిస్ ఫైటింగ్ చాంపియన్‌షిప్(ఏపీఎఫ్సీ).. భారత్‌కు చెందిన ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్(ఐపీబీఎల్) భారత్‌లో తొలిసారి బాక్సింగ్ పోటీలు నిర్వహించబోతున్నాయి. వచ్చే నెలలో దేశంలోని ఆరు ప్రధాన నగరాలు ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, ముంబై, గోవా, బెంగళూరు వేదికలుగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నాయి.
ఇందుకోసం యూఎఫ్‌సీ లైట్‌వెయిట్ మాజీ చాంపియన్ అంథోనీ పెట్టిస్ తొలిసారి భారత్‌కు రాబోతున్నాడు. డబ్ల్యూబీసీ ఇండియా చాంపియన్ సబరి జైశంకర్, సెర్గియో పెట్టిస్ మధ్య ప్రధాన పోరు జరుగుతుందని ఐపీబీఎల్ సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే పలు ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్ల్యూబీసీ) టైటిళ్లు సొంతం చేసుకున్న సబరి, సెర్గియో మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.