పంజిమ్(గోవా) : చెస్ ప్రపంచకప్‌లో భారత ప్లేయర్లు నిలకడగా రాణిస్తున్నారు. నాలుగో రౌండ్ రెండో గేమ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్, ప్రజ్ఞానంద, హరికృష్ణ డ్రా చేసుకోని ముందంజ వేశారు. హంగరీ జీఎం పీటర్ లెకోతో జరిగిన గేమ్‌ను తెలంగాణకు చెందిన ఇరిగేసి అర్జున్ డ్రా ముగించుకున్నాడు. దీంతో ఇద్దరి స్కోర్లు 1-1తో సమం కాగా, టైబ్రేక్‌లో విజేత ఎవరో తేలనుంది.
ప్రజ్ఞానంద, డానిల్ దుబోవ్ మధ్య గేమ్ డ్రా కాగా, నిల్స్ గ్రాండెలిస్(స్విట్జర్లాండ్)తో గేమ్‌ను హరికృష్ణ కష్టపడి డ్రా చేసుకున్నాడు. మరోవైపు ప్రణవ్..నోదిర్బెక్ యకుబెవ్(ఉజ్బెకిస్థాన్)పై, కార్తీక్ వెంకట్రామన్..లీ క్వాంగ్ లిమ్(వియత్నాం) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో మెగాటోర్నీలో భారత్ ఆశలన్నీ అర్జున్, ప్రజ్ఞానంద, హరికృష్ణపైనే ఉన్నాయి.