ఆశలు ఆవిరి అర్జెంటీనా చేతిలో భారత్ చిత్తు
ఐదు దశాబ్దాలుగా హాకీ ప్రపంచకప్‌లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న ట్రోఫీ కల మరోసారి నెరవేరలేదు. ఈసారైనా మన ప్లేయర్లు టైటిల్ కరువు తీరుస్తారని ఆశించిన భారత హాకీ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.
అమ్స్టెల్వీన్ : ఐదు దశాబ్దాలుగా హాకీ ప్రపంచకప్‌లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న ట్రోఫీ కల మరోసారి నెరవేరలేదు. ఈసారైనా మన ప్లేయర్లు టైటిల్ కరువు తీరుస్తారని ఆశించిన భారత హాకీ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. సెమీస్ రేసులో నిలవాలంటే అర్జెంటీనాపై కనీసం మూడు గోల్స్ తేడాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ 3-5తో ఓటమిపాలై సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఆట ఆరంభం నుంచి చివరిదాకా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అర్జెంటీనా ఆటగాళ్లలో డొమెనె (33, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా జాక్విన్ టొస్కని (1వ), నికోలస్ (6వ), లుకాస్ (53వ) తలా ఓ గోల్ కొట్టారు. భారత్ నుంచి సుఖ్జీత్ సింగ్ (10, 58వ) డబుల్ గోల్స్ చేయగా హార్ధిక్ సింగ్ (60వ) ఒక గోల్ సాధించాడు. ఈ ఓటమితో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న భారత్.. వర్గీకరణ మ్యాచ్‌లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

