హాంకాంగ్: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన టీమ్ఇండియా లీగ్ నుంచి నిష్క్రమించింది. శనివారం కువైట్‌తో తప్పక గెలువాల్సిన పూల్-సీ పోరులో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కువైట్ నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 6 వికెట్లు కోల్పోయి 79 పరుగులకు పరిమితమైంది.
అద్వానీ బోణీ
దోహా: ఐబీఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ అదిరిపోయే బోణీ కొట్టాడు. శనివారం జరిగిన తొలి రౌండ్ పోరులో పంకజ్ 4-1 తేడాతో సాహిల్ నయ్యర్(కెనడా)పై అద్భుత విజయం సాధించాడు. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన అద్వానీ ప్రత్యర్థిపై అలవోక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే టోర్నీలో భారత్ తరఫున బ్రిజేశ్ దమానీ, హుస్సేన్ ఖాన్ పోటీలో ఉన్నారు.