సువాన్: కొరియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజే భారత షట్లర్లు ఇంటిబాట పట్టారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుష్ శెట్టి మొదటి రౌండ్‌కే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ, మిక్స్డ్ డబుల్స్‌లో మోహిత్-లక్షిత అపజయం పాలయ్యారు.
ఇండోనేషియా షట్లర్ చికో ఆరా ద్వి వర్దొయొతో జరిగిన మ్యాచ్‌లో మొదటి గేమ్ 16-8తో ఉండగా ప్రణయ్ గాయంతో రిటైర్డ్‌గా వెనుదిరిగాడు. ఆయుష్.. 18-21, 18-21తో చైనీస్ తైపీకి చెందిన సు లి యాంగ్ చేతిలో ఓడాడు. మరో పోరులో కిరణ్ జార్జి.. 14-21, 22-20, 14-21తో మాజీ వరల్డ్ చాంపియన్ లొ కీన్ యూ (సింగపూర్) చేతిలో పోరాడి ఓడాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో అనుపమ.. 16-21, 15-21తో నాలుగో సీడ్, ప్రపంచ 8వ ర్యాంకర్ అయిన పుత్రి వర్దాని (ఇండోనేషియా) జోరు ముందు తలవంచింది.