Sumit Nagal | చెన్నై: ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న భారత యువ టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్.. చెన్నై ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత నంబర్‌వన్ నాగల్ 6-1, 6-4తో లూకా నార్డీ (ఇటలీ)పై విజయం సాధించాడు. ఈ ఫలితంతో సోమవారం విడుదల కానున్న ర్యాంకింగ్స్‌లో నాగల్ తొలిసారి టాప్-100లో చోటు దక్కించుకోనున్నాడు.
ఈ టోర్నీ ఆరంభం నుంచి అపజయం ఎరగకుండా దూసుకెళ్లిన నాగల్.. ప్రత్యర్థులకు కనీసం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గడం మరో విశేషం. ఏకపక్షంగా సాగిన తుదిపోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నాగల్ విజృంభించాడు. ‘చాలా సంతోషంగా ఉంది. సొంత అభిమానుల సమక్షంలో ఇలాంటి ప్రదర్శనలు మరింత ఉత్సాహాన్నిస్తాయి’ అని నాగల్ అన్నాడు