ఇండియన్స్ వెల్: భారత యువ టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్‌కు అదృష్టం కలిసొచ్చింది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పూర్తి ఫిట్నెస్ లేని కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో నాగల్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. వాస్తవానికి అర్హత రెండో రౌండ్లో ఓటమిపాలైన నాగల్.. మెరుగైన ఏటీపీ ర్యాంకింగ్స్ (101వ) ఆధారంగా టోర్నీ ప్రధాన పోరులో నిలిచాడు. ఈ సంతోషాన్ని నాగల్ తన ఎక్స్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నాదల్..ఈసారి ఎలాగైనా ఇండియన్స్ వెల్స్ టోర్నీలో పోటీపడాలనుకున్నాడు. కానీ పూర్తి స్థాయి మ్యాచ్ ఫిట్నెస్ సాధించడంలో విఫలమైన నాదల్..అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.