బ్యాంకాక్: భారత యువ షట్లర్ అష్మిత చహిలా థాయ్లాండ్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. బ్యాంకాక్ వేదికగా మంగళవారం నుంచి మొదలైన ఈ టోర్నీ అర్హత రౌండ్లలో భాగంగా అష్మిత.. 21-15, 12-21, 21-42తో హుంగ్ యి-టింగ్ (చైనీస్ తైపీ)ను ఓడించింది.
మరో పోరులో 21-11, 10-21, 21-16తో కిమ్ జు యున్ (దక్షిణ కొరియా)ను చిత్తుచేసి మెయిన్ డ్రాకు దూసుకెళ్లింది.