సిడ్నీ: భారత యువ షట్లర్ అభిషేక్ యెలిగర్ ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. క్వాలిఫయర్స్ రౌండ్లో అభిషేక్ 21-14, 21-5తో భారత్‌కే చెందిన శశావత్ దలాల్‌ను, 21-15, 21-14తోజీ యింగ్ చాన్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. తొలి రౌండ్లో అతడు ఇజ్రాయెల్ షట్లర్ మిషా జిల్బర్మన్తో తలపడనున్నాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో హర్షిత-శృతి జంట.. 19-21, 19-21తో డెనియ నుగ్రొహొ-కై కి బెర్నిస్ (ఆస్ట్రేలియా) చేతిలో చిత్తైంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి, డబుల్స్‌లో అభిమన్యు-అమన్ సైతం బుధవారం బరిలోకి దిగనున్నారు.