న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత యువ గోల్ఫర్లు శుభాంకర్శర్మ, గగన్‌జీత్ భుల్లార్ బెర్తు దక్కించుకున్నారు. ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే విశ్వక్రీడల గోల్ఫ్ కోసం అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ మంగళవారం పురుషుల, మహిళా గోల్ఫర్లతో కూడిన జాబితాను ప్రకటించింది.
ప్రస్తుతం ఒలింపిక్ ర్యాంకింగ్స్‌లో 48వ స్థానంలో ఉన్న భారత నంబర్‌వన్ గోల్ఫర్ శుభాంకర్ పారిస్ విశ్వక్రీడల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. గగన్‌జీత్ 54వ ర్యాంక్‌తో పారిస్ టికెట్ దక్కించుకున్నాడు. మరోవైపు అదితి అశోక్(24), దీక్షా దాగర్(40) కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశముంది. ఈ నెల 24న తుది జాబితా విడుదల కానుంది.