గ్రాండ్‌మాస్టర్ వైశాలి
భారత యువ చెస్ ప్లేయర్ ఆర్ వైశాలికి గ్రాండ్‌మాస్టర్(జీఎం) హోదా దక్కింది. స్పెయిన్ వేదికగా జరుగుతున్న లోబ్రెగెట్ ఓపెన్‌లో టైటిల్ గెలువడం ద్వారా వైశాలి జీఎం హోదాకు అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్లను దక్కించుకుంది.
- సోదరుడు ప్రజ్ఞానందతో కలిసి అరుదైన ఘనత
చెన్నై: భారత యువ చెస్ ప్లేయర్ ఆర్ వైశాలికి గ్రాండ్‌మాస్టర్(జీఎం) హోదా దక్కింది. స్పెయిన్ వేదికగా జరుగుతున్న లోబ్రెగెట్ ఓపెన్‌లో టైటిల్ గెలువడం ద్వారా వైశాలి జీఎం హోదాకు అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్లను దక్కించుకుంది. ఈ క్రమంలో భారత 84వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించడంతో పాటు మూడో మహిళా జీఎంగా నిలిచింది. దీనికి తోడు తన సోదరుడు ఆర్ ప్రజ్ఞానందతో కలిసి ప్రపంచంలోనే తొలి సోదర, సోదరి జోడీగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

స్పెయిన్ టోర్నీ రెండో రౌండ్లో టర్కీకి చెందిన తామెర్ తారిక్‌ను ఓడించడంతో వైశాలి 2500 పాయింట్లను చేరుకుంది. జీఎం హోదా దక్కించుకున్న వైశాలిని భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్(ఎక్స్)లో అభినందించాడు. ‘గత కొన్ని నెలలుగా వైశాలి చాలా కష్టపడింది. ఏప్రిల్‌లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో బరిలోకి దిగనుంది. వైశాలి విజయాల వెనుక వాళ్ల తల్లిదండ్రుల కఠిన శ్రమ దాగుంది’ అని రాసుకొచ్చాడు.
1 చదరంగంలో గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న తొలి అక్కాతమ్ముడిగా ప్రజ్ఞానంద, వైశాలి రికార్డుల్లోకెక్కారు.
3 భారత్ నుంచి కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న మూడో మహిళగా వైశాలి నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

