బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ బాక్సర్ నిషాంత్దేవ్కు బెర్తు దక్కింది. దీని ద్వారా పారిస్‌కు అర్హత సాధించిన తొలి బాక్సర్‌గా నిశాంత్ నిలిచాడు. బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయర్స్‌లో శుక్రవారం జరిగిన 71కిలోల క్వార్టర్స్ బౌట్లో నిశాంత్ 5-0తో వాసిలె సెబోటరీ(మాల్దోవా)పై అద్భుత విజయం సాధించాడు.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ యువ బాక్సర్..ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు 51కిలోల ప్రిక్వార్టర్స్‌లో అమిత్ పంగల్ 5-0తో కిమ్ ఇన్‌క్యు(కొరియా)పై గెలువగా 57కిలోల క్వార్టర్స్‌లో సచిన్ సివాచ్ 4-1తో సామ్యుల్(ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో అంకుశిత బొరో, అరుంధతి చౌదరీ, సంజీత్ ఓటమితో నిష్క్రమించారు.