బ్యాంకాక్: భారత యువ బాక్సర్లు అమిత్ పంగల్, జైస్మీన్ లంబోరియా పారిస్ ఒలింపిక్స్ బెర్తులు దక్కించుకున్నారు. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న రెండవ బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఆదివారం పురుషుల 51 కిలోల విభాగం క్వార్టర్స్‌లో అమిత్.. 5-0తో చైనా బాక్సర్ చువాంగ్ లియును చిత్తు చేసి పారిస్ కోటా సాధించాడు.
మహిళల 57 కిలోల క్వార్టర్స్‌లో జైస్మీన్.. 5-0తో మారిన్ (మాలి)పై నెగ్గి భారత్‌కు ఒలింపిక్స్‌లో ఆరో బెర్తును అందించింది. పురుషుల 57 కిలోల విభాగంలో సచిన్ సివాచ్ ఓటమిపాలై నిరాశపరిచాడు. భారత్ తరఫున నిఖత్ జరీన్ (50 కిలోలు), ప్రీతి (54 కిలోలు), లవ్లీనా బొర్గొహెయిన్ (75 కిలోలు) పారిస్ కోటాలను గతంలోనే దక్కించుకోగా తాజా టోర్నీలో నిషాంత్ దేవ్ (71 కిలోలు), అమిత్, జైస్మీన్తో కలిపి ఆ సంఖ్య ఆరుకు చేరింది.