బిష్కెక్: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో యువ రెజ్లర్లు సుజీత్, అభిమన్యు పసిడి పతకాలతో మెరిశారు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65కిలోల ఫైనల్లో వరల్డ్ చాంపియన్ సుజీత్ 8-1 తేడాతో ఉమిద్జోన్ జలోలోవ్(ఉజ్బెకిస్థాన్)పై ఘన విజయం సాధించాడు. తొలి గేమ్ ఇద్దరు హోరాహోరీగా తలపడ్డా..కీలకమైన రెండో గేమ్‌లో సుజీత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.మరోవైపు 70కిలోల ఫైనల్లో అభిమన్యు 5-3తో తుల్గా తుముర్పై అద్భుత విజయం సాధించాడు. 79కిలోల విభాగం తుది పోరులో సందీప్ 1-2తో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.