అమ్మాన్ (జోర్డాన్): ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్య పోరుకు అర్హత సాధించాడు. మంగళవారం ప్రారంభమైన ఈ ఈవెంట్లో తొలి రోజు గ్రీకో రోమన్ విభాగంలో పోటీలు జరుగగా భారత్ నుంచి సునీల్ కుమార్ ఒక్కడే సెమీస్ దాకా వెళ్లగలిగాడు. 87 కిలోల విభాగంలో పోటీపడుతున్న సునీల్ మొదటి బౌట్లో 10-1తో తజకిస్థాన్ రెజ్లర్ అబ్దుల్ఖేవ్ను చిత్తు చేశాడు.
కానీ సెమీస్‌లో అతడు 1-3తో ఇరాన్‌కు చెందిన యాసిన్ యజ్ది చేతిలో పరాభవం పాలయ్యాడు. జియాజిన్ హువాంగ్ (చైనా)తో బుధవారం జరిగే కాంస్య పోరులో సునీల్ తలపడనున్నాడు. మిగిలినవారి విషయానికొస్తే ఉమేశ్, నితిన్, ప్రేమ్ ఆరంభ బౌట్‌లోనే విఫలమయ్యారు.